- Home
- Sports
- Cricket
- వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకు, రోహిత్ నియామకం మంచిదే... భారత మాజీ కోచ్ రవిశాస్త్రి...
వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకు, రోహిత్ నియామకం మంచిదే... భారత మాజీ కోచ్ రవిశాస్త్రి...
హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నన్నిరోజులు, టీమిండియాలో విరాట్ కోహ్లీ డామినేషన్ సాగింది. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత రవిశాస్త్రి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో విరాట్ కోహ్లీని కష్టకాలం మొదలైంది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందే వర్క్ లోడ్ కారణంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోగా, ఆ తర్వాత అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ...
విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది...
‘టీమిండియాతో కలిసి దాదాపు ఏడేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ తప్పించాలని బీసీసీఐ భావిస్తే, దాన్ని అమలు చేసే విధానం వేరేగా ఉంటుంది...
విరాట్ కోహ్లీ నొచ్చుకోకుండా అతనికి నచ్చజెప్పి, ఆ బాధ్యతల నుంచి వైదొలిగేలా చేయాల్సింది. భారత జట్టు కోసం విరాట్ కోహ్లీ ఎంతో చేశాడు...
అందుకే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు చాలా హార్ట్ అయ్యాడు, ఈ విషయంపై బీసీసీఐ క్లారిటీ తీసుకొచ్చి ఉంటే చాలా బాగుండేది...
ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్‌కి ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక, వన్డే ఫార్మాట్‌లోనూ రోహిత్‌కే కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడమే కరెక్ట్...
విరాట్ కోహ్లీ అబద్దం చెప్పాడా? లేక సౌరవ్ గంగూలీ అబద్ధం చెప్పాడా? అనేది ఇక్కడ అనవసరం. అభిమానులకు కావాల్సింది నిజం ఏంటనేదే...
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఓ మాట చెప్పాడు, వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ మరో వ్యాఖ్య చేశాడు. ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలను తీసుకుంటే బెటర్..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
టీమిండియా చరిత్రలోనే ఇప్పటిదాకా బెస్ట్ హెడ్ కోచ్ అంటే తానేనంటూ రవిశాస్త్రి చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి...