శాస్త్రి, అతనితో కూర్చొని మాట్లాడు... గొప్ప ప్లేయర్లకు కూడా అది చాలా అవసరం...
రెండేళ్ల కిందటి వరకూ టీమిండియాకి మిడిల్ ఆర్డరే బలం... ఓపెనర్లు విఫలమైనా, లోయర్ ఆర్డర్‌లో పరుగులే రాకపోయినా... మిడిల్ ఆర్డర్‌లో ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే కలిసి పరుగుల వర్షం కురిపించేవాళ్లు... కానీ ఇప్పుడు వీళ్లే టీమిండియాకి భారంగా మారారు...
ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో అద్భుత సెంచరీ చేసి... టీమిండియాలో ఫైటింగ్ స్పిరిట్‌ను నింపాడు అజింకా రహానే. కెప్టెన్‌గా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...
లార్డ్స్‌లో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఛతేశ్వర్ పూజారాతో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన రహానే... హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే మళ్లీ మూడో టెస్టులో విఫలమయ్యాడు...
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన అజింకా రహానే కీలక సమయంలో అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే పెవిలియన్ చేరాడు...
ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 19 సగటుతో కేవలం 95 పరుగులు మాత్రమే అజింకా రహానే, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనే 61 పరుగులు చేయగా... మిగిలిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 34 పరుగులే చేశాడు.
‘అజింకా రహానే ఫెయిల్ కావడంపై టీమిండియాలో మార్పులపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే రహానే చాలా మంచి ప్లేయర్. కానీ అప్పుడప్పుడూ గొప్ప గొప్ప ప్లేయర్లకు కూడా ముందుకు వెళ్లేందుకు కాస్త మోటివేషన్ అవసరం అవుతుంది...
అలాంటి మోటివేషన్ ఇవ్వాల్సిన బాధ్యత రవిశాస్త్రి మీద ఉంది. రవిశాస్త్రి చాలా మంచి మోటివేటర్. అతను చాలా స్పీచ్‌లతో టీమిండియాలో విజయోత్సాహాన్ని నింపుతున్న విధానం అద్భుతం... కోచ్‌గా శాస్త్రి సక్సెస్‌కి ఇదే కారణం...
అజింకా రహానే దాదాపు 80 టెస్టు మ్యాచులు ఆడాడు కాబట్టి అతనికి ఏం చేయాలో బాగా తెలుసని రవిశాస్త్రి భావించవచ్చు.. కానీ ఈ విషయంలో శాస్త్రి కాస్త ఓవర్ యాక్టివ్‌గా ఉండాలి.
కాసేపు అజింకా రహానేతో కూర్చొని, అతనితో మాట్లాడాలి. డిన్నర్ సమయంలో అయినా లేదా ఇంకేదైనా సమయంలో అయినా రహానేతో మాట్లాడండి. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులను రహానే ఎలా ఎదుర్కొన్నాడో గుర్తు చేయండి...
పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌తో బ్యాటింగ్ చేసేందుకు ఓ చిన్న మాట బూస్ట్‌లా పనిచేస్తుంది. ఇప్పుడు రహానే విషయంలో అలాంటిదే కావాలి...
మిగిలిన భారత ప్లేయర్ల కంటే అజింకా రహానేకి విదేశీ పిచ్‌ల్లో మంచి యావరేజ్ ఉంది. విదేశాల్లో అతను బాగా పరుగులు చేయగలడు. అయితే ఇంగ్లాండ్‌లో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది...
రహానే జట్టుకి చాలా అవసరం. రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రాన అతన్ని పక్కనబెడతారని నేను అనుకోవడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ స్పిన్నర్ మనీందర్ సింగ్...
నాలుగో టెస్టులో ఇషాంత్ శర్మకు చోటు దక్కకపోవచ్చని అంచనా వేసిన మనీందర్ సింగ్, అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ని కానీ, శార్దూల్ ఠాకూర్‌ని కానీ ఆడించే అవకాశం ఉందని తెలిపాడు...