- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఆ ఇద్దరు దిగ్గజాల ఎంట్రీ... కామెంటేటర్లుగా రవిశాస్త్రి, సురేష్ రైనా...
ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఆ ఇద్దరు దిగ్గజాల ఎంట్రీ... కామెంటేటర్లుగా రవిశాస్త్రి, సురేష్ రైనా...
ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా అదిరిపోయే న్యూస్. మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2022 సీజన్‌లో కామెంటేటర్లుగా భారత మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు రవిశాస్త్రి, సురేష్ రైనా కనిపించి, వినిపించబోతున్నారు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి... ఐపీఎల్ 2022 ద్వారా మరోసారి కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ వంటి ఎన్నో టోర్నీల్లో రవిశాస్త్రి అందించిన కామెంటరీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది...
ఇప్పటికే 2011 వన్డే వరల్డ్ కప్ గురించి తలుచుకుంటే, ‘ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్’ అంటూ మాహీ కొట్టిన విన్నింగ్ హెలికాఫ్టర్ షాట్‌కి రవిశాస్త్రి ఇచ్చిన కామెంటరీయే చాలా మందికి గుర్తుకువస్తుంది...
హెడ్ కోచ్‌గా రిటైర్మెంట్ ఇచ్చిన కొంత కాలం బ్రేక్ తీసుకున్న రవిశాస్త్రి, ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు... రవిశాస్త్రితో పాటు ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా కూడా ఐపీఎల్ 2022 సీజన్‌లో హిందీ కామెంటేటర్‌గా కనిపించబోతున్నాడు...
ఐపీఎల్‌లో 5500+ పరుగులు చేసిన సురేష్ రైనా,2022 మెగా వేలంలో అమ్ముడుపోని విషయం తెలిసిందే. కొందరు ఆటగాళ్లు గాయపడి, సీజన్‌కి దూరం కావడంతో రైనా రిప్లేస్‌మెంట్‌గా వస్తాడని ప్రచారం జరిగింది...
అయితే సురేష్ రైనాని రిప్లేస్‌మెంట్‌గా తీసుకునేందుకు కూడా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించకపోవడంతో కామెంటేటర్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో కనిపించి, తన స్వరాన్ని వినిపించబోతున్నాడు రైనా...
ఐపీఎల్ 2022 సీజన్ కోసం కామెంటేటర్లకు రూ.5 కోట్ల వరకూ చెల్లించడానికి సిద్ధమైంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. ఐపీఎల్‌లో పాల్గొనే చాలామంది స్టార్ల ప్లేయర్ల కంటే ఇది చాలా ఎక్కువ...
ఇంగ్లీష్‌లో హర్షా భోగ్లేతో పాటు సునీల్ గవాస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, అంజుమ్ చోప్రా, ఇయాన్ బిషప్, మాథ్యూ హేడెన్, కేవిన్ పీటర్సన్ వంటి మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా ఐపీఎల్ 2022 సీజన్‌లో కనిపించబోతున్నారు...
హిందీలో ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, కిరణ్ మోరే, రవిశాస్త్రి, సురేష్ రైనా, పార్థివ్ పటేల్ వంటి మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా దర్శనం ఇవ్వబోతున్నారు...
ఇంగ్లీష్, హిందీలతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాళీ, తమిళ్‌తో పాటు ఈ సీజన్‌లో తొలిసారి గుజరాతీ భాషలోనూ ఐపీఎల్ కామెంటరీ ప్రసారం చేయనుంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్...