- Home
- Sports
- Cricket
- ఆవేశ్ ఖాన్ కంటే ఆ కుర్రాడు బాగా బౌలింగ్ వేస్తాడు... పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కామెంట్...
ఆవేశ్ ఖాన్ కంటే ఆ కుర్రాడు బాగా బౌలింగ్ వేస్తాడు... పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కామెంట్...
ఐపీఎల్ పర్పామెన్స్ కారణంగా టీమిండియాలోకి వచ్చిన బౌలర్ ఆవేశ్ ఖాన్. ఐపీఎల్ 2021 సీజన్‌లో పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఆవేశ్ ఖాన్... టీమిండియా బౌలర్‌గా మాత్రం పెద్దగా మెప్పించలేకపోతున్నాడు...

Image credit: PTI
2021 ఇంగ్లాండ్ పర్యటనలో ఆరంగ్రేటం చేయాల్సిన ఆవేశ్ ఖాన్, ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి జట్టుకి దూరమయ్యాడు. ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపిక కావడం వల్ల అదే టైమ్‌లో లంక పర్యటనలో ఆరంగ్రేటం చేసే అవకాశాన్ని కోల్పోయాడు ఆవేశ్ ఖాన్...
Avesh Khan
ఎలాగోలా ఏడాది తర్వాత ఆవేశ్ ఖాన్‌కి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన ఆవేశ్ ఖాన్, అదే వెస్టిండీస్‌పై జూలైలో వన్డే ఆరంగ్రేటం కూడా చేసేశాడు...
Image credit: PTI
అయితే ఇప్పటిదాకా 8 టీ20 మ్యాచులు ఆడిన ఆవేశ్ ఖాన్, 7 వికెట్లు మాత్రమే తీశాడు. ముఖ్యంగా టీ20ల్లో మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే డెత్ ఓవర్లలో ఇప్పటిదాకా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఆవేశ్ ఖాన్. టీ20 కెరీర్‌లో డెత్ ఓవర్లలో 38 బాల్స్ వేసిన ఆవేశ్ ఖాన్, 114 పరుగులు సమర్పించాడు...
Image credit: PTI
ఆఖరికి హంగ్ కాంగ్‌పైన కూడా 19వ ఓవర్‌లో 21 పరుగులు సమర్పించాడు ఆవేశ్ ఖాన్. ఈ ఏడాది ఆవేశ్ ఖాన్ ఎకానమీ 9.1గా ఉంది. టీమిండియా తరుపున ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. దీంతో ఆవేశ్ ఖాన్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. ఆవేఖ్ ఖాన్ కంటే విరాట్ కోహ్లీ బెటర్ బౌలర్ అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
Image credit: Getty
‘రవి భిష్ణోయ్ చాలా మంచి స్పిన్నర్. అతను జట్టుకి చాలా ప్లస్ అవుతాడు. నా ఉద్దేశంలో అతనే టీమిండియాకి నిజమైన ట్రంప్ కార్డ్. యూఏఈ పరిస్థితులను ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు...
Ravi Bishnoi
భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. హార్ధిక్ పాండ్యా తుదిజట్టులో వస్తే అతనితో కలిసి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నట్టే. కాబట్టి ఆవేశ్ ఖాన్ ప్లేస్‌లో రవి భిష్ణోయ్‌కి అవకాశం ఇస్తే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా...