- Home
- Sports
- Cricket
- మిథాలీ రాజ్ బయోపిక్‌లో విలన్ అతనేనా... ఆ టైమ్‌లో హెడ్ కోచ్‌తో విభేదాలను హైలైట్ చేస్తూ...
మిథాలీ రాజ్ బయోపిక్‌లో విలన్ అతనేనా... ఆ టైమ్‌లో హెడ్ కోచ్‌తో విభేదాలను హైలైట్ చేస్తూ...
సినిమాలో హీరో ఎంత ముఖ్యమో, విలన్ అంతే అవసరం. విలన్ ఎంత నీచంగా, కృరంగా, అవినీతిపరుడిగా ఉంటే హీరోయిజం అంత ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. మరి మిథాలీరాజ్ బయోపిక్‌లో విలన్ ఎవరు? భారత వుమెన్స్ జట్టులో లెజెండ్‌గా ఎదిగిన మిథాలీ రాజ్ కెరీర్‌లో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన వివాదం హెడ్ కోచ్ రమేశ్ పవార్‌తో గొడవల ఎపిసోడ్.

ramesh powar mithali raj
2018 టీ20 వరల్డ్‌కప్ సమయంలో భారత మహిళా జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహారించాడు టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్. ఆ సమయంలో భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కి భారత టీ20 జట్టులో చోటు కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది.
తనను కావాలనే టీ20 జట్టుకి దూరం చేస్తున్నారని హెడ్ కోచ్ రమేశ్ పవార్, సీఓఏ సభ్యురాలు డియానా ఎడ్లుల్జీలపై ఆరోపణలు చేసింది మిథాలీరాజ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనని కింద ఆడాల్సిందిగా వాళ్లు ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించింది మిథాలీ...
అయితే రమేశ్ పవార్, మిథాలీ రాజ్‌పై రివర్స్ ఆరోపణలు చేశాడు. ‘సీనియర్ ప్లేయర్‌గా జట్టు పరిస్థితిని అర్థం చేసుకుని ఆడాల్సిన మిథాలీరాజ్, బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపితే, రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని’ ఆరోపించాడు రమేశ్ పవార్...
‘వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు స్థిమితంగా, నిగ్రహం కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. కొన్నిసార్లు మన ఫీలింగ్స్‌ని పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సైలెంట్‌గా ఉండడం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు.
మన విషయంలో వివక్ష చూపించినప్పుడు దాన్ని బయటపెట్టడానికి చాలా ధైర్యం కావాలి... ప్రతీ ఒక్కరికీ ఒకవైపు జరిగింది మాత్రమే తెలుస్తుంది. రెండో వైపు వారి వాదన వినడానికి ఇష్టపడరు కూడా.
అందుకే నేను నా విషయంలో జరిగింది ప్రపంచానికి తెలియాలని అనుకున్నాను. నాకు క్రికెట్‌కి మించింది ఏదీ లేదు. క్రీజులోకి దిగిన ప్రతీ సారి నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించా కానీ నా స్వంత రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు...
Mithali Raj
నా పైన అలాంటి ఆరోపణలు చేసినప్పుడు కోపం, ప్రస్టేషన్, ఇరిటేషన్ అన్నీ వచ్చాయి. అన్నింటినీ కంట్రోల్ చేసుకుని, నా ఆటపైనే ఫోకస్ చేశా...’ అంటూ కామెంట్ చేసింది మిథాలీ రాజ్...
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిథాలీజ్ 50 పరుగులు చేసి ఆదుకుంది. అయితే మిథాలీ ఇన్నింగ్స్‌లో 25 డాట్ బాల్స్ ఉండడంతో ఆమె కేవలం తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు రమేశ్ పవార్...
ఈ సంఘటన తర్వాత రమేశ్ పవార్ కాంట్రాక్ట్ గడువు ముగిసి ఆ పదవి నుంచి తప్పుకోవడంతో డబ్ల్యూవీ రామన్, భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత రమేశ్ పవార్‌ను తిరిగి మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
రమేశ్ పవార్‌తో వివాదం తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది మిథాలీరాజ్. టీ20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్, మిథాలీరాజ్ మధ్య కూడా విభేదాలున్నాయని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. స్లోగా ఆడే మిథాలీ, టీ20ల్లో పనికి రాదని హర్మన్‌ప్రీత్ భావించేదని, ఇదే ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమని వార్తలు వచ్చాయి...
మిథాలీరాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’లో విలన్‌గా రమేశ్ పవార్‌ని చూపించబోతున్నారా? లేక మహిళా క్రికెట్ టీమ్‌పై వివక్షచూపిస్తున్న బీసీసీఐ పెద్దలను విలన్లుగా చూపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది..