- Home
- Sports
- Cricket
- ఆకస్మాత్తుగా తండ్రి మరణం, గతిలేక డ్రైవర్ అవుదామనుకున్న హర్భజన్ సింగ్! ఐదుగురు అక్కాచెల్లెల అండతో...
ఆకస్మాత్తుగా తండ్రి మరణం, గతిలేక డ్రైవర్ అవుదామనుకున్న హర్భజన్ సింగ్! ఐదుగురు అక్కాచెల్లెల అండతో...
టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్ హర్భజన్ సింగ్. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన హర్భజన్ సింగ్, టెస్టుల్లో టీమిండియా తరుపున హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి బౌలర్ కూడా. ఎన్నో మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించిన హర్భజన్ సింగ్, ఒకానొక దశలో క్రికెట్ వదిలేసి ట్రక్ డ్రైవర్ అవుదామనుకున్నాడు...

హర్భజన్ సింగ్ తండ్రి సర్ధార్ సర్‌దేవ్ సింగ్ ప్లాహాకి మొత్తం ఆరుగురు సంతానం. ఐదుగురు అక్కాచెల్లెల మధ్య అల్లారుముద్దుగా పెరిగాడు పుత్రరత్నం హర్భజన్ సింగ్. భజ్జీకి నలుగురు అక్కలు, ఓ చెల్లెలు. సర్దార్ సర్‌దేవ్ సింగ్‌కి బాల్ బేరింగ్ బిజినెస్ ఉండేది. అదే వ్యాపారాన్ని చూసుకుందామని అనుకున్నాడు హర్భజన్ సింగ్...
అయితే కొడుకుని టీమిండియా క్రికెటర్‌గా చూడాలని ఆశపడిన సర్ధార్ సర్‌దేవ్, హర్భజన్ సింగ్‌ని క్రికెట్ ట్రైయినింగ్‌కి పంపించాడు. తొలుత బ్యాటర్‌గా మారాలని ప్రాక్టీస్ మొదలెట్టిన హర్భజన్ సింగ్, ఆ తర్వాత స్పిన్ బౌలర్‌గా మారి, సూపర్ సక్సెస్ అయ్యాడు...
రోజూ సూర్యోదయానికి ముందు మూడు గంటలు, సూర్యాస్తమయం తర్వాత మరో మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు హర్భజన్ సింగ్. అయితే టీమిండియా తరుపున క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే 2000వ సంవత్సరంలో సర్ధార్ సర్‌దేవ్ మరణించారు. తండ్రి మరణంలో భజ్జీ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది...
భారత జట్టులో అప్పటికి స్థిరమైన చోటు దక్కించుకోలేకపోయిన హర్భజన్ సింగ్, కుటుంబాన్ని పోషించేందుకు అమెరికాలో ఓ ట్రక్కు డ్రైవర్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని అక్కాచెల్లెలు, భజ్జీకి సపోర్ట్‌గా నిలిచారు...
తండ్రి సర్దార్ కోరుకున్నట్టు, క్రికెటర్‌గా కొనసాగమని, అవసరమైతే తాము కుటుంబ ఖర్చులను భరిస్తామని భరోసా ఇచ్చారు. అలా క్రికెట్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు భజ్జీ. 2001 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అనిల్ కుంబ్లే గాయపడడంతో భారత జట్టులోకి తిరిగి వచ్చిన హర్భజన్ సింగ్, టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా మారిపోయాడు..
క్రికెటర్‌గా సక్సెస్ సాధించిన తర్వాత ముగ్గురు అక్కల పెళ్లిళ్లు చేసిన హర్భజన్ సింగ్, సోదరీమణుల కోసం 2002లో నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2005లోనూ భజ్జీ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి...
అయితే తన చెల్లి పెళ్లి చేసేవరకూ తాను మ్యారేజ్ చేసుకోవద్దని నిర్ణయించుకున్న హర్బజన్ సింగ్, 2010 సమయానికి అక్కాచెల్లెలందరి పెళ్లిళ్లు చేసేశాడు. ఆ తర్వాత ఎట్టకేలకు 2015లో గీతా బస్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు భజ్జీ...
తన అక్కాచెల్లెళ్లు అండగా నిలవకపోతే తాను ఎక్కడో ఓ ట్రక్కు నడుపుకుంటూ ఉండేవాడని చెబుతుంటాడు హర్భజన్ సింగ్. ప్రస్తుతం భజ్జీ, రాజ్యసభ గౌరవ సభ్యుడిగా, క్రికెట్ కామెంటేటర్‌గా ఉన్నాడు.. గత ఏడాది రెండు సినిమాల్లో కూడా నటించాడు హర్భజన్ సింగ్.