Rajat Patidar: భారత్ నుంచి వన్డే క్రికెట్ లోకి మరో ప్లేయర్ ఎంట్రీ...
Patidar makes his ODI debut: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే పార్ల్ లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. భారత్ నుంచి అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి రజత్ పటిదార్ ఎంట్రీ ఇచ్చాడు.
Rajat Patidar
Ind vs Sa: దక్షిణాఫ్రికా-భారత్ వన్డే సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అనుకున్నట్టుగానే రజత్ పాటిదార్ ను జట్టులోకి తీసుకున్నారు. భారత జట్టు మరో ఒపెనర్ గా బరిలోకి దిగాడు. సుదర్శన్ తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను పటిదార్ ప్రారంభించాడు.
Rajat Patidar
రజత్ పాటిదార్ ఐపీఎల్ 2021 సీజన్‌లో అరంగేట్రం చేయడంతో అతని ఐపీఎల్ ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 12 మ్యాచ్ లను ఆడాడు. 40.40 సగటుతో 404 పరుగులు చేశాడు. ధనాధన్ బ్యాటింగ్ తో మంచి గుర్తింపు సాధించి భారత జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఐపీఎల్ లో పటిదార్ అత్యధిక స్కోరు 112*. ఐపీఎల్ లీగ్ లో ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో 280 బంతులు ఎదుర్కొన్న ఈ ప్లేయర్ 144.2 స్ట్రైకింగ్ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు.
2022 ఐపీఎల్ సీజన్‌లో గాయపడిన లువ్నిత్ సిసోడియా స్థానంలో పాటిదార్ ఆర్సీబీలోకి వచ్చాడు. అతన్ని రూ. 20 లక్షలకు ఆర్సీబీ దక్కించుకుంది. అయితే, గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ ఎంట్రీకి ముందు రంజీ మ్యాచ్ లలో అదరగొట్టాడు. 2018-19 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ఎనిమిది మ్యాచ్‌లలో 713 పరుగులు చేసి అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. దేశవాళీ T20ల్లో 31 మ్యాచ్ లను ఆడిన పటిదార్.. ఏడు అర్ధ సెంచరీలతో 861 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 96 పరుగులు.