- Home
- Sports
- Cricket
- Jos Buttler: బట్లర్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్.. ఒప్పుకుంటే నాలుగేండ్లకు లాక్ అయినట్టే..
Jos Buttler: బట్లర్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్.. ఒప్పుకుంటే నాలుగేండ్లకు లాక్ అయినట్టే..
Jos Buttler: ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్తాన్ రాయల్స్ ఆ జట్టు ఓపెనర్, ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ కు బంపరాఫర్ ఇచ్చింది.

ఐపీఎల్ తొలి సీజన్ లో కప్పు కొట్టి ఆ తర్వాత అంతగా ప్రభావం చూపకపోయినా గడిచిన మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న రాజస్తాన్ రాయల్స్.. ఆ జట్టుకు ఓపెనర్ గా ఉన్న జోస్ బట్లర్ కు క్రేజీఆఫర్ ఇచ్చింది. ప్యూర్ టీ20 బ్యాటర్ లక్షణాలు పుష్కలంగా ఉన్న బట్లర్ ను ఐపీఎల్ తో పాటు తమ మిగతా లీగ్ లలో కూడా వాడేందుకు రాజస్తాన్ పక్కా ప్లానింగ్ తో సిద్ధమైంది.
Image credit: PTI
ఈ మేరకు బట్లర్ ను తమతోనే అట్టిపెట్టుకునేందుకు గాను భారీ క్యాష్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. రాబోయే నాలుగేండ్ల పాటు బట్లర్ తమతోనే ఉండేలా ఒప్పందం చేసుకోనున్నది. రాజస్తాన్ ఆఫర్ పై ప్రస్తుతం బట్లర్ ఆలోచనలో పడ్డాడట. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు సారథిగా ఉన్న బట్లర్ కు ఈసీబీ నుంచి బాగానే అందుతోంది.
అయితే రాజస్తాన్.. బట్లర్ ఊహించని రేంజ్ లో ఆఫర్ ఇచ్చిందని.. లీగ్ లలో భాగమైతే చాలని, ఈసీబీ కాంట్రాక్టును పూర్తిగా కోల్పోవాల్సిన పన్లేదని కూడా బట్లర్ కు రాజస్తాన్ రాయల్స్ ప్రతినిధులు వివరించినట్టు తెలుస్తున్నది.
Jos Buttler
ప్రస్తుతానికి ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తో పాటు దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్‌ఎ 20 లో రాజస్తాన్ టీమ్ పార్ల్ రాయల్స్ కు కూడా బట్లర్ ఆడుతున్నాడు. టీ20 క్రికెట్ కు ఉన్న క్రేజ్, ఫ్రాంచైజీ లీగ్ లపై జనాల ఆసక్తి.. ప్రతీ దేశంలోనూ కొత్త లీగులు పుట్టుకొస్తుండటంతో భవిష్యత్ ల వాటిలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న రాజస్తాన్ ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
Image credit: PTI
ఐపీఎల్ లో 2018 నుంచి రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న బట్లర్.. ఇప్పటివరకు 96 మ్యాచ్‌లలో 37.92 సగటుతో 3,223 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ జట్టుకు రెండో పొట్టి ప్రపంచకప్ అందించడంలో బట్లర్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్ - 2022లో కూడా బట్లర్ 863 పరుగులు చేశాడు. ఆ సీజన్ లో ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు.
రాజస్తాన్ రాయల్స్ కు ఐపీఎల్ తో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ లో పార్ల్ రాయల్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో బార్బోడస్ రాయల్స్ ఉన్నాయి. ఈ ఏడాది నుంచి అమెరికాలో జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ గనక సక్సెస్ అయితే అక్కడ కూడా రాజస్తాన్ ఫ్రాంచైజీని కొనే అవకాశాలున్నాయి.