- Home
- Sports
- Cricket
- ఆ కారణం వల్లే సురేష్ రైనా వేలంలో అమ్ముడుపోలేదు... రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగర్కర...
ఆ కారణం వల్లే సురేష్ రైనా వేలంలో అమ్ముడుపోలేదు... రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగర్కర...
ఐపీఎల్ చరిత్రలో 5 వేలకు పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్ సురేష్ రైనా. టీమిండియాకి ఆడిన మ్యాచుల కంటే ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచులు ఆడిన సురేష్ రైనా... లీగ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అలాంటి రైనాకి కూడా ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఘోర పరాభవం ఎదురైంది...

Image Credit: Getty Images
ఐపీఎల్‌లో 205 మ్యాచులు ఆడి 32.52 సగటుతో 136.73 స్ట్రైయిక్ రేటుతో 5528 పరుగులు చేశాడు సురేష్ రైనా... ఇందులో 39 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...
బ్యాట్స్‌మెన్‌గా, ఫీల్డర్‌గా, బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనా, కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే గుజరాత్ లయన్స్ జట్టును టేబుల్ టాపర్‌గా నిలిపాడు...
అలాంటి సురేష్ రైనాని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసేందుకు కూడా ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. వేలం ముగిసే సమయానికి సీఎస్‌కే పర్సులో రూ.2 కోట్లకు పైగా డబ్బులు మిగిలే ఉన్నాయి.. అయినా రైనాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు...
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత ఆప్తుడిగా పేరొందిన సురేష్ రైనా, మాహీ నమ్మకాన్ని కోల్పోవడం వల్లే సీఎస్‌కే మేనేజ్‌మెంట్, అతన్ని కొనుగోలు చేయలేదనే టాక్ వినిపించింది...
తాజాగా రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగర్కర్, సురేష్ రైనా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
‘సురేష్ రైనా, మెగా వేలంలో అమ్ముడుపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా కోణాల్లో చూడాలి...
ఏళ్లు గడిచే కొద్ది ఆటగాళ్లు, వారి ఆటతీరు మారిపోతూ ఉంటుంది. కొత్త ప్లేయర్ల ఎంట్రీ తర్వాత పాత ప్లేయర్లకు ఉండే విలువ, ప్రాధాన్యం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది...
సురేష్ రైనా, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి రైనా కూడా ఓ కారణం. ఐపీఎల్‌లో రైనా ఓ లెజెండ్. దాన్ని ఎవ్వరూ కాదనలేరు...
అయితే ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే... కొన్నిసార్లు ప్లేయర్లు, సీజన్‌కి సూట్ కారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీలు వస్తున్నాయి. పోటీ పెరుగుతుంది, లీగ్ సైజు పెరుగుతుంది...
ఇలాంటి సీజన్‌లో సురేష్ రైనా లాంటి సీనియర్ తమ జట్టులో కుదురుకుపోవచ్చని ఫ్రాంఛైజీలు భావించాయి. అతను బెస్ట్ ప్లేయరే కావచ్చు, కానీ ఇప్పుడా ప్లేయర్ అవసరం ఏ ఫ్రాంఛైజీకి లేదు...
అన్నింటికీ మించి ఐపీఎల్ 2022 సీజన్‌లో సురేష్ రైనా అమ్ముడుపోకపోవడానికి కోచ్‌లు, ప్రణాళికలు, విశ్లేషణలు, యజమానులు, వారి ఆలోచనలు కూడా కారణం కావచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌ఆర్ కోచ్ కుమార సంగర్కర...