- Home
- Sports
- Cricket
- అప్పుడు రాయల్స్, ఇప్పుడు ముంబై ఇండియన్స్... ఆ లెక్కన మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరంటే?..
అప్పుడు రాయల్స్, ఇప్పుడు ముంబై ఇండియన్స్... ఆ లెక్కన మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరంటే?..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. ఐదుకి ఐదు మ్యాచుల్లో గెలిచిన ముంబై ఇండియన్స్, మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది...

Image credit: PTI
ఓ పక్క ఆర్‌సీబీ, టైటిల్ ఫెవరెట్‌గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించింది. సీజన్‌లో ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది ముంబై ఇండియన్స్. మొదటి ఐదుకి ఐదు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన స్మృతి మంధాన టీమ్, మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరేది కష్టమే...
Mumbai Indians Women
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 లీగ్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 143 పరుగుల భారీ తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో నెగ్గిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్, యూపీ వారియర్స్‌ని కూడా 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది...
మొదటి రౌండ్‌లో నాలుగు టీమ్స్‌ని ఓడించిన ముంబై ఇండియన్స్, రెండో రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ చరిత్రలో మొదటి ఐదుకి ఐదు మ్యాచుల్లో నెగ్గిన మొట్టమొదటి టీమ్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్...
Image credit: PTI
ఐపీఎల్ 2008 మొదటి సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొదటి జట్టు రాజస్థాన్ రాయల్స్. డబ్ల్యూపీఎల్ 2023 మొదటి సీజన్‌లో నాకౌట్ స్టేజీకి దూసుకెళ్లిన తొలి జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ తొలి సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి వెళ్లిన తొలి జట్టుగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచింది..
Image credit: PTI
ఆ లెక్కన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్, టైటిల్ గెలుస్తుందని అంటున్నారు ఆ టీమ్ ఫ్యాన్స్. 3 హాఫ్ సెంచరీలు చేసి, మూడు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు 5 మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన సైకా ఇషాక్.. ముంబై విజయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు..