ముంబైని ఫాలో అవుతున్న రాజస్థాన్ రాయల్స్... జట్టులోకి సంగక్కర ఎంట్రీ...
2021 ఐపీఎల్ సీజన్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ భారీగా మార్పులు చేస్తోంది. ఇప్పటికే మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వేలానికి వదిలేస్తున్నట్టు ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్, యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా టీమ్ డైరెక్టర్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగర్కరను నియమించింది రాజస్థాన్ రాయల్స్.

ఆర్ఆర్ టీమ్‌కి సంబంధించిన విషయాలన్నింటినీ కుమార సంగర్కర దగ్గర్నుండి చూసుకోబోతున్నాడు...

ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని, రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని తెలిపాడు సంగర్కర.

అయితే టీమ్ డైరెక్టర్‌గా సంగర్కరను నియమించడం వెనక ముంబై ఇండియన్స్ సెంటిమెంట్‌ను రాజస్థాన్ రాయల్స్ ఫాలో అవుతోందని అంటున్నారు ఫ్యాన్స్.

సంగర్కర సహచర బ్యాట్స్‌మెన్ మహేల జయవర్థనే, ముంబైకి రెండు సీజన్లుగా మెంటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఈ రెండు సీజన్లలోనూ ముంబై ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

జయవర్థనేకి సన్నిహితుడైన సంగర్కర, రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలుపుతాడని భావిస్తోంది రాజస్థాన్ రాయల్స్...

‘క్రికెట్ వరల్డ్‌లో ఆల్‌టైమ్ బెస్ట్ వికెట్ కీపర్లలో ఒకడైన కుమార సంగర్కరతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానని రాజస్థాన్ రాయల్స్ కొత్త సారథి సంజూ శాంసన్ తెలిపాడు...

ఈ ఏడాది మినీ వేలానికి ముందు స్టీవ్ స్మిత్‌తో పాటు అంకిత్ రాజ్‌పుత్, ఓషేన్ థామస్, వరుణ్ అరోన్, టామ్ కుర్రాన్, అనిరుథ్ జోషి, ఆకాశ్ సింగ్, శశాంక్ సింగ్‌లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లకు ప్రాతినిథ్యం వహించిన కుమార సంగర్కర... 2011-20 దశాబ్దపు బెస్టు టెస్టు టీమ్‌కి వికెట్ కీపర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.

2020 సీజన్‌లో ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నడూ లేనట్టుగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్...