- Home
- Sports
- Cricket
- ధోనీ స్నేహితుడు కావడం వల్లే సురేశ్ రైనా ఆడాడు, యూసఫ్ పఠాన్ ఆడలేకపోయాడు... - యువరాజ్ సింగ్...
ధోనీ స్నేహితుడు కావడం వల్లే సురేశ్ రైనా ఆడాడు, యూసఫ్ పఠాన్ ఆడలేకపోయాడు... - యువరాజ్ సింగ్...
2011 వన్డే వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించి, ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ టైటిల్ గెలిచిన యువరాజ్ సింగ్, 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత ధోనీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు యువీ...

‘2019 వన్డే వరల్డ్‌కప్ జట్టులో నాకు చోటు దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. అదీకాకుండా నెంబర్ 4 బ్యాట్స్‌మెన్ విషయంలో టీమిండియా వ్యవహారించిన తీరు కూడా సరికాదు...

నెం.4 స్థానంలో అంబటి రాయుడు ఆకట్టుకుంటున్నాడు. అతనికి వన్డే వరల్డ్‌కప్ జట్టులో ఎందుకు చోటు ఇవ్వలేదు. టాపార్డర్ చాలా బలంగా ఉంది, ఇంక నెం. 4 బ్యాట్స్‌మెన్‌తో అవసరం ఏముందని వాళ్లు భావించినట్టున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...

‘నేను సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చాను. దాదా మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసేవాళ్లు. ఒకటి రెండు మ్యాచులు సరిగ్గా ఆడకపోయినా జట్టులో స్థానం ఉంటుందని భరోసా ఇచ్చేవాళ్లు...

ధోనీ కెప్టెన్ అయ్యాక అలాంటి సపోర్ట్ నాకు దక్కలేదు. గంగూలీ కెప్టెన్సీలో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకంటే అంతలా దాదా ఎంకరేజ్ చేసేవాడు...

మాహీ కెప్టెన్ అయ్యాక కానీ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక కానీ జట్టులో ప్లేయర్లకు అలాంటి సపోర్ట్ దక్కలేదు...

గంగూలీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక జట్టులో సీనియర్లకు గౌరవం దక్కడం లేదు. ఎవ్వరైనా, ఎవ్వరికైనా ఏమైనా చెప్పొచ్చు... మాకు ఎప్పుడూ సపోర్ట్ లేకపోయినా రైనాకి మాత్రం ధోనీ మద్ధతు ఉండేది.

సురేశ్ రైనాని ఎప్పుడూ ధోనీ బ్యాక్ చేస్తూ ఉండేవాడు. ప్రతీ కెప్టెన్‌కి ఓ ఫెవరెట్ ప్లేయర్ ఉంటాడు. వాడు ఆడకపోయినా సరే, జట్టులో తప్పనసరిగా ఉండాలని కెప్టెన్ కోరుకుంటాడు.

మహేంద్ర సింగ్ ధోనీకి రైనా అలాంటివాడే. రైనాను ధోనీ చాలాసార్లు ఆదుకున్నాడు. యూసఫ్ పఠాన్ అద్భుతంగా ఆడుతూ వికెట్లు కూడా తీసుకున్న టైంలో అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు.

మంచి ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్‌ని పక్కనబెట్టి 2011 వన్డే వరల్డ్‌కప్ మ్యాచుల్లో ఫామ్‌లో లేని సురేశ్ రైనాకి ఛాన్స్ ఇచ్చాడు ధోనీ. ఎందుకంటే అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం...’ అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు యువరాజ్ సింగ్...

భారత క్రికెట్‌కి ఆడిన దాని కంటే ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతూ, తన జట్టు సీఎస్‌కే అనేక విజయాలు అందించాడు సురేశ్ రైనా. ఎంత మాహీకి ఫెవరెట్ కాకపోతే ఇద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...