మూడో వన్డేకి వర్షం అంతరాయం... రాణించిన పృథ్వీషా, సంజూ శాంసన్...
శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి భారత జట్టు 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ధనుంజయ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి జోరు మీదున్నట్టు కనిపించిన శిఖర్ ధావన్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు.

11 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన కెప్టెన్ శిఖర్ ధావన్, చమీరా బౌలింగ్‌లో కీపర్ భునకకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

పృథ్వీషా, సంజూ శాంసన్ కలిసి రెండో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 49 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన పృథ్వీషా, శనక బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరాడు.

46 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన సంజూ శాంసన్ కూడా హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. 118 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

మనీశ్ పాండే 15 బంతుల్లో 10 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. జయవిక్రమ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన భారత జట్టుకి అనుకూలంగా ఫలితం దక్కింది.