- Home
- Sports
- Cricket
- ఆ ఇద్దరిలా బ్యాటింగ్ చేయలేనని తెలుసుకున్నా... వీరూ, టెండూల్కర్‌లపై రాహుల్ ద్రావిడ్...
ఆ ఇద్దరిలా బ్యాటింగ్ చేయలేనని తెలుసుకున్నా... వీరూ, టెండూల్కర్‌లపై రాహుల్ ద్రావిడ్...
టెస్టులు, వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతి కొద్ది మంది లెజెండరీ క్రికెటర్లలో రాహుల్ ద్రావిడ్ ఒకడు. టెస్టుల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్‌గా నిలిచిన రాహుల్ ద్రావిడ్, ‘ది వాల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రాహుల్ ద్రావిడ్, తన సహచర ప్లేయర్లు, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

టెస్టుల్లో 52.31 సగటుతో 13288 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించి... సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు... అలాగే వన్డేల్లో 344 మ్యాచులు ఆడి 39.16 సగటుతో 10889 పరుగులు చేసిన ద్రావిడ్, 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు బాదాడు...
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వస్ కలీస్ తర్వాతి స్థానంలో నిలిచిన రాహుల్ ద్రావిడ్.. . తన కెరీర్‌లో 31258 బంతులను ఎదుర్కొని, అత్యధిక బంతులను ఫేస్ చేసిన బ్యాటర్‌గా వినూత్నమైన రికార్డును నెలకొల్పాడు...
Image credit: PTI
‘నేను వెనక్కి తిరిగి నా కెరీర్‌ని చూసుకుంటే అది ఓ గేమ్ ఛేంజర్‌గా అనిపిస్తుంది. నా మెంటల్ ఎనర్జీని నేను పూర్తిగా ఉపయోగించగలిగా. మ్యాచ్ ఆడనప్పుడు కూడా ఆట కూడా విపరీతంగా ఆలోచించేవాడిని...
అలా ఆలోచించడం వల్ల నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు రాదని నాకు త్వరగానే అర్థమైంది. అందుకే మ్యాచ్ అయిపోయాక దాని గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు... వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని...
నేను ఎప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ అంత వేగంగా పరుగులు చేయలేను. అతను చాలా ఈజీగా ఆ దూకుడు మంత్రాన్ని అలవర్చుకోగలిగాడు. అది అతనికి తన పర్సనాలిటీ వల్ల వచ్చిన తత్వం...
ఆరంభంలో వీరూని చూసి నేను కూడా వేగంగా ఆడాలని ప్రయత్నించా. అలా ఆడిన ప్రతీసారి త్వరగా అవుటయ్యేవాడిని. అందుకే నా ఫిజికల్ స్టామినా కంటే మెంటల్ స్ట్రెంగ్త్‌ని వాడడమే కరెక్ట్ అనిపించింది...
అలాగే సచిన్ టెండూల్కర్ అంత సుదీర్ఘమైన కెరీర్‌ని కూడా కొనసాగించలేనని తెలుసుకున్నా. టెండూల్కర్ సుదీర్ఘ కాలం పరుగులు చేస్తూనే ఉన్నాడు. నాకు ఉన్నదల్లా ఓపిక. ఆ ఓపికనే నా బలంగా మార్చుకోవాలని అనుకున్నా...
Rahul Dravid
అందుకే నేను ఎప్పుడూ బౌలర్లతోనే పోటీపడేవాడిని. ఎవరు ముందు అలసిపోతారో చూద్దామని ఛాలెంజ్ చేసుకునేవాడిని. అది నా ఆటను మరింత మెరుగు చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...