కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్! 16 ఏళ్ల తర్వాత కోచ్‌గా... రాహుల్ ద్రావిడ్, ‘ఛక్ దే ఇండియా!’ కబీర్ అవుతాడా..
షారుక్ హీరోగా వచ్చిన ‘ఛక్ దే! ఇండియా’ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారత ప్లేయర్లు, ఎక్కడ ఏ విజయాన్ని అందుకున్నా... ‘ఛక్ దే... ఛక్ దే ఇండియా’ పాటే వినిపిస్తుంది. ఈ మూవీలో హీరో షారుక్, కబీర్ ఖాన్ అనే హాకీ ప్లేయర్ పాత్రలో నటించాడు..
హాకీ వరల్డ్ కప్ ఫైనల్‌లో పెనాల్టీ స్టోక్ కొట్టలేక భారత జట్టు ఓటమికి కారణమవుతాడు కెప్టెన్ కబీర్ ఖాన్. ఈ మ్యాచ్ కారణంగా అతన్ని అందరూ తీవ్రంగా విమర్శిస్తారు. భారత జట్టును కావాలని ఓడించాడని తీవ్రమైన ఆరోపణలు చేస్తారు.
ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు మహిళా హాకీ టీమ్‌కి కోచ్‌గా వచ్చి, టీమ్‌కి టైటిల్ దక్కడంలో కీలక పాత్ర పోషిస్తాడు కబీర్. రాహుల్ ద్రావిడ్ కెరీర్ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది.
2003 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అంచనాలకు మించి రాణించి ఫైనల్‌కి వెళ్లింది. అయితే ఆసీస్ చేతుల్లో పరాజయం పాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఈ ప్రపంచ కప్ తర్వాత సౌరవ్ గంగూలీని తప్పించి, రాహుల్ ద్రావిడ్‌కి కెప్టెన్సీ అప్పగించింది మేనేజ్‌మెంట్..
రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఛేజింగ్‌లో వరుసగా 14 విజయాలు అందుకుని, వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది భారత జట్టు. ఎన్నో అంచనాలతో 2007 వరల్డ్ కప్‌ని మొదలెట్టిన టీమిండియా, గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్, శ్రీలంక చేతుల్లో ఓడింది.
బర్మోడాపై ప్రతాపం చూపించి భారీ విజయం అందుకుని, గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించి, ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.
ఈ పరాభవం తర్వాత రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్ల ఇళ్లపై దాడులు జరిగాయి. ధోనీ, యువరాజ్ వంటి క్రికెటర్ల దిష్టి బొమ్మలు ఊరేగించి, నిరసనలు తెలిపారు అభిమానులు..
ఇంతటి దారుణ పరాభవం తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. ఇది జరిగిన 17 ఏళ్లకు భారత జట్టుకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్..
Virat Kohli Rahul Dravid
ద్రావిడ్ కోచింగ్‌లో 2022 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ నుంచి ఇంటిదారి పట్టిన భారత జట్టు, 2023 వన్డే వరల్డ్ కప్‌లో అంచనాలకు మించి అదరగొడుతూ ఫైనల్‌కి దూసుకెళ్లింది.
ఇప్పుడు రాహుల్ ద్రావిడ్, ‘ఛక్ దే! ఇండియా’ లో కబీర్‌లా మారేందుకు భారత జట్టు, ఆఖరి ఆటలో గెలిస్తే చాలు.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌తో రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ కూడా ముగియనుంది. దీంతో వరల్డ్ కప్ విజయంతో కోచ్ కెరీర్‌ని ముగించాలని అనుకుంటున్నాడు ద్రావిడ్..