పరువు పోయినా, ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అయినా ప్రయోగాలు ఆపం! రాహుల్ ద్రావిడ్ స్పష్టం...
పదేళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ కావడంతో ఈసారి భారత జట్టు ఎలాగైనా ప్రపంచ కప్ గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్...
2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి 2008 నుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టామని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు. అంటే 2007 వన్డే వరల్డ్ కప్ పరాజయం తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ కోసం ప్రణాళికలు రచించి, దానికి తగ్గట్టుగా ముందుకు సాగింది టీమిండియా...
Virat Kohli Rahul Dravid
2021లో టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టు, 2022లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడింది. ఈ ఏడాది జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడింది. ఏడాదికి ఒకటి, రెండు ఐసీసీ టోర్నీలు ఆడుతుండడంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రిపరేషన్స్ కోసం టీమిండియాకి పెద్దగా సమయం దొరకలేదు..
Rahul Dravid-Rohit Sharma
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రెండు నెలల ముందు వెస్టిండీస్ టూర్‌కి వెళ్లేకంటే... ఇండియాలో టీమిండియా ప్లేయర్లతో ఓ లిస్టు-A సిరీస్ నిర్వహించి ఉన్నా... భారత జట్టు ప్రిపరేషన్స్‌కి బాగా ఉపయోగపడి ఉండేది..
Rahul Dravid
అలా కాకుండా భారత పిచ్‌లకు విరుద్ధంగా ఉండే వెస్టిండీస్ టూర్‌లో అనవసర ప్రయోగాలు చేస్తూ చేతులు కాల్చుకుంటోంది టీమిండియా. ఈ పరాజయం, భారత క్రికెట్ టీమ్ వాతావరణాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. అయితే పరువు పోయినా, ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అయినా ప్రయోగాలు మాత్రం ఆపమని అంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
‘నిజం చెప్పాలంటే, కొందరు ప్లేయర్లను టెస్ట్ చేయానికి ఇదే ఆఖరి అవకాశం. నలుగురు ప్లేయర్లు, ప్రస్తుతం గాయాలతో ఎన్‌సీఏలో ఉన్నారు. ఆసియా కప్‌కి, వరల్డ్ కప్‌కి పెద్ద సమయం లేదు. కాబట్టి సమయం మించిపోక ముందే ప్లేయర్లను పరీక్షించాలని అనుకున్నాం..
శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ గాయాలతో టీమ్‌కి దూరంగా ఉన్నారు. అందుకే బ్యాకప్ ప్లేయర్లకు సమయం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే అసలు సిసలైన మ్యాచ్ విన్నర్లు ఎవరో తెలుస్తుంది...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే స్టార్లుగా నిరూపించుకున్నారు. వాళ్లకు ఇప్పుడు మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం కంటే రిజర్వు బెంచ్‌లో ఉన్న ప్లేయర్లలో ఎవరు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఆడాలో పరీక్షించడానికి ఇదే ఆఖరి ఛాన్స్...’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్..