భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్, మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ... టీమిండియా దశను తిప్పడానికి...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి టీమిండియా మెంటర్‌గా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అతను కేవలం టీ20 వరల్డ్‌కప్ టోర్నీ వరకే మెంటర్ అంటూ బీసీసీఐ స్పష్టం చేసినా, మాహీ అభిమానులు మాత్రం మరోలా కోరుకుంటున్నారు...
ప్రస్తుత భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు, టీ20 వరల్డ్‌కప్ టోర్నీతో ముగియనుంది. ఆ తర్వాత భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి రాహుల్ ద్రావిడ్ సిద్దంగా లేడని వార్తలు వస్తున్నాయి...
మాహీ ఫ్యాన్స్ అయితే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి మెంటర్‌గా వ్యవహరించబోతున్న మహేంద్ర సింగ్ ధోనీకి టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు ఇస్తే బాగుంటుందని అంటున్నారు...
అయితే బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్, మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ ఏకకాలంలో పనిచేస్తే భారత జట్టు దశ తిరుగుతుందని అంటున్నాడు...
‘బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. కానీ నా వరకైతే రవిశాస్త్రి శకం ముగిసిన తర్వాత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్, మెంటర్‌గా ఎమ్మెస్ వస్తే బాగుంటుంది...
ఈ విషయాన్ని నేను నా సహచర కామెంటేటర్లతో చెప్పాను. భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన రవిశాస్త్రి తర్వాత రాహుల్ ద్రావిడ్ అయితే ఆ స్థానానికి సరిగ్గా న్యాయం చేయగలడు...
అలాగే మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ కూడా రాహుల్ ద్రావిడ్‌కి తోడైతే, టీమిండియా దశ మారిపోతుంది.. ఇద్దరూ కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తులు, గేమ్‌ను అర్థం చేసుకోవడంలో దిట్టలు...
భారత జట్టుకి ఏం చేస్తే మంచిదో ఆ ఇద్దరికీ తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదని నా ప్రగాఢనమ్మకం... ఇప్పటికే రాహుల్ ద్రావిడ్, అండర్19 కోచ్‌గా ఎందరో సత్తా ఉన్న ఆటగాళ్లను టీమిండియాకి పరిచయం చేశాడు...
ఒకవేళ రవిశాస్త్రి తర్వాత రాహుల్ ద్రావిడ్‌కి హెడ్ కోచ్ బాధ్యతలు, ఎమ్మెస్ ధోనీని మెంటర్‌గా కొనసాగించకపోతే... మిగిలినవాళ్లు తెలీదు కానీ నేను మాత్రం చాలా డిస్సపాయింట్ అవుతా...’ అంటూ కామెంట్ చేశాడు ఎమ్మెస్కే ప్రసాద్...