- Home
- Sports
- Cricket
- గోవాలో గర్ల్‌ఫ్రెండ్ ఇషానీతో ఘనంగా రాహుల్ చాహార్ వివాహం... స్పెషల్ అట్రాక్షన్‌గా మాలతి చాహార్...
గోవాలో గర్ల్‌ఫ్రెండ్ ఇషానీతో ఘనంగా రాహుల్ చాహార్ వివాహం... స్పెషల్ అట్రాక్షన్‌గా మాలతి చాహార్...
భారత క్రికెటర్, స్పిన్నర్ రాహుల్ చాహార్ ఓ ఇంటివాడయ్యాడు. గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటెల్‌లో తన గర్ల్ ఫ్రెండ్, ఫియాన్సీ ఇషానీ జోహార్‌తో కలిసి ఏడుడగులు నడిచిన రాహుల్ చాహార్, ఆగ్రాలో మార్చి 12న గ్రాండ్ రిసెప్షన్ పార్టీ చేసుకోబోతున్నాడు...

బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్‌ని ప్రేమించిన రాహుల్ చాహార్, 2019లోనే ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు...
రెండున్నరేళ్ల తర్వాత గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. రాహుల్ చాహార్ పెళ్లి వేడుకకు ఆయన సోదరుడు దీపక్ చాహార్, సోదరి మాలతి చాహార్, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు... తమ్ముడి వివాహ వేడుకలో అక్క మాలతి చాహార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవడం విశేషం.
రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్టు ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ చాహార్, గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు...
ఐపీఎల్ 2019 సీజన్‌లో 13 వికెట్లు, 2020 సీజన్‌లో 15 వికెట్లు తీసిన రాహుల్ చాహార్, గత సీజన్‌లో 11 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు...
ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని కాదని, రాహుల్ చాహార్‌ని టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు...
అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన రాహుల్ చాహార్, ఆ మ్యాచ్‌లో కూడా వికెట్ తీయలేకపోయాడు...
ఓవరాల్‌గా ఓ వన్డే, 5 టీ20 మ్యాచులు ఆడిన రాహుల్ చాహార్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది...
భారత క్రికెటర్, స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ రాహుల్ చాహార్, ప్రేయసి ఇషానీ వివాహ వేడుక ఫోటోలు...
భారత క్రికెటర్, స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ రాహుల్ చాహార్, ఇషానీ వివాహ వేడుకలోని కొన్ని ఫోటోలు...
భారత క్రికెటర్, స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ రాహుల్ చాహార్, ఇషానీ వివాహ వేడుక ఫోటోలు... దీపక్ చాహార్, ఆయన గర్ల్‌ఫ్రెండ్‌తో అక్క మాలతి చాహార్, వారి తండ్రి...