MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2025 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌లో చీలిక.. కోర్టును ఆశ్రయించిన ప్రీతి జింటా

ఐపీఎల్ 2025 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌లో చీలిక.. కోర్టును ఆశ్రయించిన ప్రీతి జింటా

Punjab Kings split Preity Zinta moves court : ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఇంకా సమయం ఉంది కానీ ఇప్ప‌టికే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సంద‌డి మొద‌లైంది. అయితే, పంజాబ్ కింగ్స్‌లో చీలిక క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతీ జింటా హైకోర్టును ఆశ్రయించినట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 18 2024, 12:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
preity zinta

preity zinta

రాబోయే ఐపీఎల్ సీజ‌న్ (ఐపీఎల్ 2025) కోసం బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వివిధ ఫ్రాంఛైజీల‌తో వ‌రుస‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఐపీఎల్ లో నిబంధ‌న‌ల మార్పులు ఆసక్తిక‌రంగా మారాయి. 
 

26

రాబోయే సీజ‌న్ లో దాదాపు అన్ని జ‌ట్ల‌లో చాలా మార్పులు క‌నిపించే అవ‌కాశ‌ముంది. కొత్త ప్లేయ‌ర్ల‌తో పాటు కెప్టెన్లు కూడా మారే అవ‌కాశాలు ఉన్నాయి. 

36

ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. జ‌ట్ల కూర్పుల‌పై వివిధ ఫ్రాంఛైజీలు బిజీబిజీగా గ‌డుపుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో పంజాబ్ కింగ్ చీలిక క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌లో చీలిక కనిపించింది. బాలీవుడ్ స్టార్, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతీ జింటా హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ప్రీతి జింటా షేర్లకు సంబంధించి ఈ వివాదం వ‌చ్చిన‌ట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

 

46

పంజాబ్ కింగ్స్ కు నలుగురు యజమానులు ఉన్నారు. నాలుగు షేర్లలో అతిపెద్ద వాటాదారు మోహిత్ బర్మన్, అతను 48 శాతం వాటా కలిగి ఉన్నారు. నెస్ వాడియా 23 శాతం షేర్లను పొందిన మూడవ యజమాని. మిగిలిన షేర్లు నాల్గవ యజమాని కరణ్ పాల్ వద్ద ఉన్నాయి. ప్రీతి జింటా కూడా 23 శాతం షేర్లను కలిగి ఉంది.  ట్రిబ్యూన్ నివేదికల ప్రకారం, ప్రీతి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్-1996లోని సెక్షన్ 9 ప్రకారం కోర్టుకు చేరింది.

56

మోహిత్ బర్మన్ షేర్లలో అత్యధిక వాటాను కలిగి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఆయన తన 11.5 శాతం షేర్లను ఎవరికైనా విక్రయించాలనుకుంటున్నాడు. అయితే ప్రీతి జింటా మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకమని సమాచారం. అతను తన షేర్లను ఎవరికి విక్రయించాలనుకుంటున్నాడు అనేది ఇంకా ధృవీకరించబడలేదు. అయితే, క్రిక్‌బజ్ ప్రకారం, బర్మన్ తన షేర్లను విక్రయించే ఆలోచన లేదని చెప్పాడు. ఈ విషయంపై ప్రీతి, వాడియా ఇంకా బహిరంగంగా మాట్లాడలేదు.

66

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి అందరికీ తెలిసిందే. గత 17 ఏళ్లలో, జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడం ఒక్క‌సారి మాత్ర‌మే జ‌రిగింది. ఐపీఎల్ 2024 ప్రారంభంలో పంజాబ్ కింగ్స్ బాగానే కనిపించింది కానీ తర్వాత, ఎప్పటిలాగే మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయింది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?
Recommended image2
IND vs WI : వెస్టిండీస్‌తో చావో రేవో.. హోం గ్రౌండ్ లో రింకూ సింగ్ ఆడేనా?
Recommended image3
IND vs WI : భారత అభిమానులకు టెన్షన్.. విండీస్‌తో తలపడితే మనోళ్లకి గండమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved