- Home
- Sports
- Cricket
- పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా ట్రేవర్ బేలిస్... సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్‌కి భారీ ఆఫర్...
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా ట్రేవర్ బేలిస్... సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్‌కి భారీ ఆఫర్...
ఐపీఎల్‌లో ప్రతీ సీజన్ ముందు ప్లేయర్లను, కోచింగ్ సిబ్బందిని మారుస్తూ హడావుడి చేయడం పంజాబ్ కింగ్స్‌కి అలవాటు. ఇప్పటికే 15 సీజన్లలో 14 మంది కెప్టెన్లను మార్చిన పంజాబ్ కింగ్స్, లక్ కలిసి వస్తుందేమోనని ఫ్రాంఛైజీ పేరు, లోగోలను కూడా మార్చింది. అయితే ఏదీ కలిసి రాలేదు... ఇప్పుడు మరోసారి 2023 సీజన్‌కి ముందు కొత్త కోచ్ వేటలో ఉంది పంజాబ్ కింగ్స్...

2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా నియమించుకుంది పంజాబ్ కింగ్స్. గత సీజన్‌లో బ్యాటర్‌గా మెప్పించిన మయాంక్ అగర్వాల్, ఈసారి కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్‌లోనూ సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక ఫెయిల్ అయ్యాడు...
Image credit: IPL
దీంతో మయాంక్ అగర్వాల్‌ని పక్కనబెట్టి కొత్త కెప్టెన్ వేటలో పంజాబ్ కింగ్స్ బిజీగా ఉందని వార్తలు వచ్చాయి. పంజాబ్ కింగ్స్ ఈ వార్తలను కొట్టి పారేసింది. 2023 సీజన్‌లోనూ పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలను మయాంక్ అగర్వాల్ మోయబోతున్నాడని స్పష్టం చేసింది. అయితే కోచింగ్ సిబ్బందిలో మార్పులు జరగడం ఖాయంగా మారింది...
Image credit: PTI
2019 అక్టోబర్ నుంచి పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు...
2023 సీజన్‌కి ముందు హెడ్ కోచ్‌గా వ్యవహరించేందుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, టీమిండయా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిలను సంప్రదించింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ ఇద్దరితో సంప్రదింపులు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్‌ని, త్వరలో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా ప్రకటించబోతున్నట్టు సమాచారం...
Trevor Bayliss
ఆస్ట్రేలియాకి చెందిన ట్రేవర్ బేలిస్, జాతీయ జట్టు తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయితే కోచ్‌గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. శ్రీలంక జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రేవర్ బేలిస్, బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు...
కేకేఆర్‌కి రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించిన ట్రేవర్ బేలిస్, ఇంగ్లాండ్ జట్టుకి హెడ్ కోచ్‌గా 2019 వన్డే వరల్డ్ కప్ అందించాడు. 2020-21 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రేవర్ బేలిస్, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు..