శిఖర్ ధావన్‌కి షాక్... ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్...
ఐపీఎల్ 2022 సీజన్‌కి కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను ప్రకటించింది పంజాబ్ కింగ్స్ జట్టు. వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టులోకి చేరిన భారత సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్‌కి పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగినా రిటైన్ చేసుకున్న ఏకైక క్యాప్డ్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌నే కొత్త సారథిగా ప్రకటించింది...

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కెరీర్ ఆరంభించిన మయాంక్ అగర్వాల్, ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్ల తరుపున ఆడాడు...
2018 నుంచి పంజాబ్ కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్న మయాంక్ అగర్వాల్‌ను ఐపీఎల్ 2022 సీజన్ కోసం రూ.12 కోట్ల రిటైన్ చేసుకుంది... మయాంక్‌తో పాటు అన్‌క్యాప్డ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కి మాత్రమే పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ దక్కింది...
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది కెప్టెన్లను వాడిన ఫ్రాంఛైజీగా పంజాబ్ కింగ్స్‌కి రికార్డు ఉంది. మయాంక్ అగర్వాల్, పంజాబ్ కింగ్స్‌కి 13వ కెప్టెన్‌గా మారబోతున్నాడు...
2008 సీజన్‌లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఆడిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత కుమార సంగర్కర, మహేళ జయవర్థనే, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైక్ హస్సీ, జార్జ్ బెయిలీ, వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవిచంద్రన్ అశ్విన్, కెఎల్ రాహుల్ వంటి కెప్టెన్లను మార్చింది..
యువీ కెప్టెన్సీలో 2008 సీజన్‌లో ఫ్లేఆఫ్స్ చేరిన పంజాబ్ కింగ్స్, జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో ఫైనల్‌లోకి దూసుకెళ్లి, కేకేఆర్ చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది...
ఆ తర్వాత వరుసగా 8 సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేరలేకపోతున్న పంజాబ్ కింగ్స్, గత సీజన్‌లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో ఓ మ్యాచ్ ఆడింది...
కెఎల్ రాహుల్ కడుపునొప్పితో తప్పుకోవడంతో తాత్కాలిక సారథిగా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకి విజయం అందించలేకపోయినా, కెఎల్ రాహుల్ కంటే మెరుగ్గా కెప్టెన్సీ నిర్వహించి క్రికెట్ విశ్లేషకుల మన్ననలు అందుకున్నాడు మయాంక్ అగర్వాల్...
క్రికెట్‌లో మంచి మిత్రులుగా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ వేర్వేరు జట్లకు కెప్టెన్లుగా ఐపీఎల్ 2022 సీజన్ ఆడబోతుండడం విశేషం.
గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌ను రూ.17 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇచ్చిన విషయం తెలిసిందే...
మయాంక్ అగర్వాల్, హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా కెప్టెన్లుగా ఎంట్రీ ఇవ్వబోతుంటే ఆర్‌సీబీ ఇప్పటిదాకా 2022 సీజన్ కెప్టెన్‌ని ప్రకటించలేదు.