- Home
- Sports
- Cricket
- టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ... ఐపీఎల్ కంటే మరీ అంత తక్కువా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ... ఐపీఎల్ కంటే మరీ అంత తక్కువా...
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. మరో 16 రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా 8వ ఎడిషన్ పొట్టి ప్రపంచకప్ మొదలుకానుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)...

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 గ్రూప్ స్టేజీలో ఆడే 12 జట్లు కూడా 40 వేల డాలర్లు (దాదాపు 32 లక్షల 60 వేల రూపాయలు) అందుకుంటాయి. వీటిల్లో గెలిచి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించిన నాలుగు జట్లు మరో రూ.40 వేల డాలర్లు అదనంగా అందుకుంటాయి...
సూపర్ 12 రౌండ్‌లో ఓడిన 8 జట్లు కూడా తలా 70 వేల డాలర్లు (57 లక్షల రూపాయలకు పైగా) అందుకుంటాయి. సూపర్ 12 రౌండ్‌లో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కి మరో 40 వేల డాలర్లు అదనం. సెమీ ఫైనల్ చేరిన 4 జట్లు 4 లక్షల డాలర్లు (3 కోట్ల 26 లక్షలకు పైగా ) అందుకుటాయి...
ఫైనల్‌లో ఓడిన జట్టుకి 8 లక్షల డాలర్లు (దాదాపు 6 కోట్ల 52 లక్షలకు పైగా) అందించే ఐసీసీ, ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకి ట్రోఫీతో పాటు 16 లక్షల డాలర్లు (దాదాపు 13 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ రూపంలో అందించనుంది. అయితే ఇది ఐపీఎల్‌లో ఇచ్చే ప్రైజ్‌మనీతో పోలిస్తే చాలా తక్కువ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ప్రైజ్ మనీ రూపంలో రూ.20 కోట్లు అందుకుంది. అంటే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 విన్నర్‌కి ఇచ్చే మొత్తం కంటే రూ.7 కోట్ల రూపాయలు ఎక్కువ...
గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని గెలిచిన ఆస్ట్రేలియా, ఈసారి పొట్టి ప్రపంచకప్‌కి వేదిక ఇవ్వనుంది. ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఈసారి టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగుతున్నాయి..