MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పృథ్వీ షా కు పొగరెక్కువ.. తానో పెద్ద స్టార్ అని ఫీలింగ్.. శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్ షాకింగ్ కామెంట్స్

పృథ్వీ షా కు పొగరెక్కువ.. తానో పెద్ద స్టార్ అని ఫీలింగ్.. శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్ షాకింగ్ కామెంట్స్

IPL 2023: టీమిండియా  యువ ఆటగాడు పృథ్వీ షా పై  భారత క్రికెట్ జట్టు మాజీ  పేసర్, శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్  కర్సన్ ఘావ్రీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  

2 Min read
Author : Srinivas M
Published : May 28 2023, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత  భారత క్రికెట్ లో ఆ స్థాయి  ఓపెనర్ గా ఎదుగుతాడని భావించిన  ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. వరుస వైఫల్యాలతో క్రమంగా టీమ్ నుంచి దూరమయ్యాడు.   సుమారు రెండున్నరేండ్ల తర్వాత ఇటీవలే మళ్లీ టీమిండియాలోకి వచ్చిన షా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

ఇక ఐపీఎల్ - 16 లో అయితే  చెత్త ప్రదర్శనతో    8 మ్యాచ్ లలో  106 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ ఆరంభంలో అతడు ఆడిన ఆరు మ్యాచ్ లలో స్కోర్లు 12, 7, 0, 15, 0, 13గా ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిని పక్కనబెట్టింది. తాజాగా  షా పై శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్,  టీమిండియా మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

36

గిల్ - షా లు ఇద్దరూ ఒకేసారి కెరీర్ ఆరంభించారని..  కానీ షా తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోక   కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంటున్నాడని.. అంతేగాక అతడికి  తానో స్టార్‌ను అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందని, తననెవరూ ఏమీ చేయలేరనే పొగరుతో ఉంటాడని  ఆరోపించాడు.

46

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఘావ్రీ మాట్లాడుతూ.. ‘గిల్ - షా ఇద్దరూ భారత్ తరఫున 2018లో అండర్ -19 ఆడినవాళ్లే. షా సారథ్యంలోనే గిల్ ఆ  టోర్నీలో రెచ్చిపోయాడు.   పృథ్వీ కూడా  వరల్డ్  కప్ ప్రదర్శనలతో టీమిండియాలోకి  ఎంట్రీ ఇచ్చాడు.  కానీ ఇప్పుడు చూడండి. గిల్ ఎక్కడున్నాడు..? షా ఎక్కడున్నాడు..?  

56

పృథ్వీ తనను తాను ఓ స్టార్ లా ఫీల్ అవుతాడు. తననెవరూ టచ్ చేయలేరని..  తనకు తిరుగులేదనే పొగరుతో ఉంటాడు. కానీ అతడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. క్రికెట్  లో ఏ ఫార్మాట్, టోర్నీ అయినా   బ్యాటర్ అవుట్  కావడానికి ఒక్క బంతి చాలు..  క్రికెట్ లో రాణించాలంటే  నిబద్దతో  పాటు క్రమశిక్షణ కూడా అవసరం. నిరంతరం శ్రమిస్తేనే ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకుంటారు. 

66

గిల్ బ్యాటింగ్ లో లోపాలుండేవి. కానీ అతడు వాటిని సరిదిద్దుకున్నాడు.  అందుకు చాలా శ్రమించాడు. ఇప్పుడు మనం అతడి సక్సెస్ ను చూస్తున్నాం. కానీ షా మాత్రం అలా చేయడం లేదు.  2018లో ఏ తప్పులైతే  చేస్తున్నాడో ఇప్పుడూ అవే రిపీట్ అవుతున్నాయి..’అని  ఘావ్రీ  విమర్శలు గుప్పించాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Recommended image2
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Recommended image3
IND vs AFG: లక్నోలో గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల మోత.. అఫ్గానిస్తాన్‌ బౌలర్లకు చుక్కలు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved