డకౌట్... ఫీల్డింగ్‌లో క్యాచ్ డ్రాప్... పృథ్వీషాపై బీభత్సమైన ట్రోలింగ్... మళ్లీ ఛాన్స్ ఇస్తారా?
First Published Dec 18, 2020, 4:05 PM IST
యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా... పింక్ బాల్ టెస్టులో రెండో బాల్‌కే డకౌట్ అయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో కూడా ఫెయిల్ అయిన పృథ్వీషాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన శుబ్‌మన్ గిల్‌కి కాదని, పృథ్వీషాకి అవకాశం ఇచ్చి విరాట్ కోహ్లీ తప్పు చేశాడని విమర్శించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో మరోసారి విమర్శలకు అవకాశం ఇచ్చాడు పృథ్వీషా. లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో పృథ్వీషాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమీలు ప్రత్యేక్షమయ్యాయి.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?