ప్రీతి జింటా మాస్టర్ ప్లాన్... ఆర్‌సీబీ పర్సు ఖాళీ చేయించిన పంజాబ్ కింగ్స్ ఓనర్...

First Published Feb 19, 2021, 10:28 AM IST

ఐపీఎల్ మినీ వేలం 2021 మొదలు కాకముందు పంజాబ్ కింగ్స్ పర్సులో ఏకంగా రూ.53 కోట్లకు పైగా ఉన్నాయి. దీంతో వేలంలో ప్రీతి జింటా షాపింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని భావించారంతా. అనుకున్నట్టుగానే ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏకంగా నలుగురు ప్లేయర్లు రూ.14 కోట్ల మార్కును దాటారు. అయితే ఆశ్చర్యంగా పంజాబ్ కింగ్స్ ఖాతాలో బోలెడు డబ్బు మిగలగా, ఆర్‌సీబీ పర్సు ఖాళీ అయ్యింది.