- Home
- Sports
- Cricket
- కోచ్ అలా చెప్పగానే విరాట్ కోహ్లీ రూమ్‌లోకి వెళ్లి ఏడవడం మొదలెట్టాడు... - ప్రదీప్ సాంగ్వాన్...
కోచ్ అలా చెప్పగానే విరాట్ కోహ్లీ రూమ్‌లోకి వెళ్లి ఏడవడం మొదలెట్టాడు... - ప్రదీప్ సాంగ్వాన్...
విరాట్ కోహ్లీతో కలిసి అండర్ 19 వరల్డ్ కప్ 2008 టోర్నీ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్. ఐపీఎల్‌లో ఢిల్లీ టీమ్‌కి ఆడాలని ఆశపడిన కోహ్లీ కోరిక నెరవేరకపోవడానికి కూడా ప్రదీప్‌యే కారణం... టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయిన ప్రదీప్ సాంగ్వాన్, తన పాత టీమ్ మేట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు...

ఫీల్డ్‌లో మోస్ట్ అగ్రెసివ్ బిహేవియర్‌తో విరాట్ కోహ్లీ ఎంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడే, అదే సంఖ్యలో విమర్శలు ఎదుర్కొన్నాడు. దూకుడుకి మారుపేరుగా నిలిచి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లకు వారి దేశాల్లోనే చుక్కులు చూపించాడు విరాట్...
అయితే విరాట్ కోహ్లీ ఆన్‌ఫీల్డ్‌లో ఎంత దూకుడుగా వ్యవహరిస్తాడే, అంతే ఎమోషనల్ పర్సన్ కూడా. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఓడినప్పుడు, టీమిండియా, ఐసీసీ టోర్నీ మ్యాచుల్లో ఓడినప్పుడు విరాట్ కోహ్లీ క్రీజులోనే ఏడ్చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది...
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, తన సొంత రాష్ట్రమైన ఢిల్లీకి ఆడాలని ఆశపడ్డాడు. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్ మేనేజ్‌మెంట్ మాత్రం కోహ్లీని కాదని, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్‌ని సెలక్ట్ చేసుకుంది. దీంతో అండర్ 19 వరల్డ్ కప్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ టీమ్‌కి వెళ్లాడు...
2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఆడిన ప్రదీప్ సాంగ్వాన్, ఆ తర్వాత కోల్‌కత్తా నైట్‌రైడర్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకి ఆడాడు. మూడు సీజన్ల తర్వాత 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, ప్రదీప్‌ని మెగా వేలంలో కొనుగోలు చేసింది...
‘మేం అప్పుడు పంజాబ్‌లో అండర్ 17 గేమ్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ అంతకుముందు ఆడిన 2-3 మ్యాచుల్లో పెద్దగా పరుగులు చేయలేకపోయారు. అప్పుడు మాకు కోచ్‌గా అజిత్ చౌదరీ ఉండేవాడు. ఆయన కోహ్లీని ‘చీకూ’ అని పిలిచేవాడు...
అప్పటికీ మా టీమ్‌లో విరాట్ మెయిన్ ప్లేయర్. అయితే అజిత్ సర్ నాతో... ‘కోహ్లీ దగ్గరికి వెళ్లి, వచ్చే మ్యాచ్‌లో అతను ఆడడం లేదని చెప్పు... సరదాగా ఓ ప్రాంక్ చేద్దాం అన్నాడు. అన్నట్టుగానే టీమ్ మీటింగ్‌లో విరాట్ పేరు చెప్పలేదు. అంతే మీటింగ్ అవ్వగానే విరాట్ కోహ్లీ తన రూమ్‌కి వెళ్లి ఏడవడం మొదలెట్టాడు...
వెంటనే కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ సర్‌కి ఫోన్ చేసి నేను ఈ సీజన్‌లో 200-250 పరుగులు చేశాను అని చెప్పాడు. అయితే గత మూడు మ్యాచుల్లో స్కోరు చేయలేదని పక్కనబెట్టేస్తారా... అంటూ గట్టిగా ఏడవడం మొదలెట్టాడు...
కొద్దిసేపటికి తర్వాత నా దగ్గరికి వచ్చి ‘చెప్పు సాంగ్వాన్, నేనేం తప్పు చేశా. ఈ సీజన్‌లో చాలా పరుగులు చేశా కదా...’ అన్నాడు. నేను ‘అవును... నిన్ను పక్కనబెట్టడం తప్పే.. ’ అన్నాను. ఆ రోజంతా విరాట్ కోహ్లీ నిద్ర పోలేదు...
వెళ్లి పడుకోమ్మని చెప్పాను. ‘లేదు, నేను నిద్ర పోను. నేను ఆడనప్పుడు నిద్ర పోవడం ఎందుకు...’ అన్నాడు. అప్పుడు... ‘ఒరేయ్ ఇదంతా ప్రాంక్... నిన్ను ఏడిపించడానికి అజిత్ సర్ ఇలా చెప్పారు...’ అని చెప్పాను... ఆ మాట విన్నాకే విరాట్ కోహ్లీ, వెళ్లి నిద్రపోయాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్ సాంగ్వాన్...