మహ్మద్ షమీని కూర్చోబెట్టడం కష్టమే! ఎంతైనా అదీ ఇష్టమే.. టీమిండియా బౌలింగ్ కోచ్ కామెంట్స్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ. అయితే కొన్ని నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న మహ్మద్ షమీ, ఆసియా కప్ 2023 టోర్నీలోనూ ఇప్పటిదాకా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు..
Mohammad Shami
జస్ప్రిత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లడంతో అతని స్థానంలో నేపాల్‌తో మ్యాచ్ ఆడాడు మహ్మద్ షమీ. ఆ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ 29 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు..
Shami
అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ ఆడలేదు మహ్మద్ షమీ. ఆ తర్వాత పాకిస్తాన్‌తో, శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచుల్లోనూ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు..
Jasprit Bumrah
‘జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్‌ని ఎన్‌సీఏ నుంచి సమీక్షిస్తూ ఉన్నాం. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ చాలా అవసరం. అందుకే బుమ్రాని అన్ని మ్యాచుల్లో ఆడించాలని అనుకుంటున్నాం..
టీమిండియాకి నలుగురు క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. తుది జట్టులో ముగ్గురినే మాత్రమే ఆడించగలం. మహ్మద్ షమీ లాంటి ప్లేయర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడం చాలా కష్టమే. అయితే ఏ టీమ్‌కి అయినా ఇలాంటి బెస్ట్ ఆప్షన్లు చేతిలో ఉండడం ఇష్టమే..
మహ్మద్ షమీకి ఉన్న అనుభవం, అతను భారత జట్టుకి అందించిన విజయాలు వెలకట్టలేనివి. ఓ ప్లేయర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టేటప్పుడు ఆ విషయం, అతనికి చెప్పడమే చాలా కష్టమైన విషయం. అయితే మేం చాలా క్లియర్‌గా ప్రతీ విషయాన్ని ప్లేయర్లకు వివరిస్తున్నాం..
Babar Azam
టీమ్ కాంబినేషన్ కోసం కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. హార్ధిక్ పాండ్యా వర్క్ లోడ్‌ని మ్యానేజ్ చేయడానికి ఏం చేయాలో అది చేస్తున్నాం. ఇప్పుడు అతను ఫిట్‌గా ఉన్నాడు, వరుసగా ఆడాలని అనుకుంటున్నాం.
నేను, అండర్19 నుంచే తిలక్ వర్మను చూస్తున్నా. సౌతాఫ్రికాలోనే అతని బౌలింగ్ స్కిల్స్ చూశాను. అతన్ని ఆడించాలా? వద్దా? అనేది కెప్టెన్‌కే వదిలేశాం. ఎక్స్‌ట్రా బౌలర్ కావాలని అనుకుంటే తిలక్ వర్మకి చోటు దక్కుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే...