- Home
- Sports
- Cricket
- హనీమూన్ లో నీ నడుము జాగ్రత్త.. అసలే ముందు ప్రపంచకప్ ఉంది.. దీపక్ చాహర్ కు సోదరి బోల్డ్ ఉపదేశం
హనీమూన్ లో నీ నడుము జాగ్రత్త.. అసలే ముందు ప్రపంచకప్ ఉంది.. దీపక్ చాహర్ కు సోదరి బోల్డ్ ఉపదేశం
Deepak Chahar: టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఇటీవలే తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ ను వివాహం చేసుకున్నాడు. జూన్ 2న ఆగ్రాలో వాళ్ల పెళ్లి జరిగింది. త్వరలో కొత్త జంట హనీమూన్ కు వెళ్లనున్నది.

జూన్ 2 న కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పనులు పూర్తయ్యాక దీపక్ చాహర్-జయా భరద్వాజ్ లు త్వరలోనే హనీమూన్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు.
అయితే దీపక్ చాహర్ సోదరి ట్విటర్ లో తమ్ముడికి కాస్త బోల్డ్ గా హితోపదేశం చేసింది. నవ దంపతులతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్న ఆమె.. హనీమూన్ లో నీ నడుము జాగ్రత్త అని రాసుకొచ్చింది.
ట్విటర్ లో మాలతి చాహర్ స్పందిస్తూ.. ‘ఇప్పుడు ఈమె (జయా భరద్వాజ్) మా ఇంటి పిల్ల అయిపోయింది. మీ వైవాహిక జీవితం నూరేళ్లు సాఫీగా సాగిపోవాలని ఆశిస్తున్నాను.
తమ్ముడూ.. హనీమూన్ లో నీ నడుము జాగ్రత్త గా చూసుకో ప్లీజ్. అసలే మనకు ముందు టీ20 ప్రపంచకప్ ఉంది..’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సోదరి స్థానంలో ఉన్న మాలతి ఇలా ట్వీట్ చేయడం సభ్యత కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అక్కవై ఉండి ఇంత అభ్యంతరకరంగా మాట్లాడతావా..? అంటూ మాలతిపై ఫైర్ అవుతున్నారు.
అయితే ఇదే సమయంలో మరికొంత మంది మాత్రం ఆమె మాట్లాడినదాన్లో తప్పేమీ లేదని.. ప్రతీ విషయానికి అనవసర అర్థాలు ఆపాదించి విమర్శించడం తగదని సూచిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో ఒక్క ఓవర్ వేసి తొడకండరాలు పట్టేయడంతో గాయపడ్డాడు. ఆ తర్వాత బెంగళూరు లోని ఎన్సీఏలో కొన్నాళ్లు రిహాబిటేషన్ సెంటర్ లో గడిపాడు.
ఈ క్రమంలోనే అతడికి మళ్లీ వెన్ను నొప్పికి గురయ్యాడు. దీంతో ఐపీఎల్ -15 సీజన్ మధ్యలో అయినా వస్తాడని ఆశించిన చెన్నై సూపర్ కింగ్స్ కు నిరాశే ఎదురైంది. ఈ సీజన్ కు ముందు ఫిబ్రవరిలో జరిగిన వేలంలో సీఎస్కే.. రూ. 14 కోట్లుతో అతడిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.