- Home
- Sports
- Cricket
- ‘ప్లీజ్ సార్! నన్ను ఎలాగైనా’... వన్డే వరల్డ్‌కప్‌కి ముందు ఫిజియోను వేడుకున్న హార్ధిక్ పాండ్యా..
‘ప్లీజ్ సార్! నన్ను ఎలాగైనా’... వన్డే వరల్డ్‌కప్‌కి ముందు ఫిజియోను వేడుకున్న హార్ధిక్ పాండ్యా..
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి చోటు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. పూర్తి ఫిట్‌గా లేకపోయినా కేవలం మెంటర్ ఎమ్మెస్ ధోనీ రికమెండేషన్‌తో పాండ్యా టీమ్‌లోకి వచ్చాడని వార్తలు వచ్చాయి... అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో పాండ్యా కీ మెంబర్ కానున్నాడు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత కొద్దికాలం అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తి బ్రేక్ తీసుకున్న హార్ధిక్ పాండ్యా... పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆల్‌రౌండ్ షోతో ఇరగదీస్తున్న హార్ధిక్ పాండ్యా, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు...
Image credit: Getty
ఇంగ్లాండ్ టూర్‌లో బెస్ట్ టీ20 స్కోరు నమోదు చేసిన హార్ధిక్ పాండ్యా, వన్డేల్లో తొలిసారి నాలుగు వికెట్లు తీసి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు.. ఇంగ్లాండ్‌లో 4 వికెట్లు తీసి, 50+ స్కోరు చేసిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు...
గతంలో భారత క్రికెట్ జట్టుకి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించిన శంకర్ బసు, హార్ధిక్ పాండ్యా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
Hardik Pandya
‘హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. కష్టపడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 2019 వరల్డ్ కప్‌కి ముందు ఐపీఎల్‌లో హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు...
నొప్పి భరించలేక ఆడడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. ఓ రోజు నా దగ్గరికి వచ్చి.. ‘సార్ ప్లీజ్ సార్... ఎలాగైనా వరల్డ్ కప్ ఆడేలా చూడండి. నేను ఎలాగైనా ఫిట్‌గా మారాలి... ’ అంటూ వేడుకున్నాడు..
Image credit: PTI
అతని తపన చూసి నేను ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల పాటు శ్రమించి, అతన్ని పూర్తి ఫిట్‌గా చేయగలిగాం.. అనుకున్నదాని కంటే చాలా తక్కువ సమయంలోనే ఫిట్‌నెస్ సాధించాడు హార్ధిక్...
Image credit: PTI
హార్ధిక్ పాండ్యా ఎక్కువ జూనియర్ క్రికెట్ ఆడలేదు. సెడన్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎంపికై, స్టార్‌గా మారిపోయాడు. అందుకే ఇప్పుడు తనని తాను మెరుగుపర్చుకోవడానికి నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడు...
Image credit: PTI
జూనియర్ క్రికెట్ ఆడి ఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు నిత్యం గాయపడుతూనే ఉన్నారు.. ఇప్పుడు గాయాలు కూడా ఆటలో భాగంగా మారిపోయాయి...’ అంటూ కామెంట్ చేశాడు శంకర్ బసు..