యాషెస్ సిరీస్ కంటే ఐపీఎల్ ఆడడమే కష్టం... ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ హారీ బ్రూక్ కామెంట్స్...
ఐపీఎల్ 2023 వేలంలో హారీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన హారీ బ్రూక్, మిగిలిన 10 మ్యాచుల్లో కలిపి 90 పరుగులే చేస అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...
Harry Brook
ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయిన హారీ బ్రూక్, ఏడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు. 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పొజిషన్‌లో నిలవడానికి హారీ బ్రూక్ ఫెయిల్యూర్ కూడా ఓ కారణం..
Image credit: PTI
ప్రస్తుతం ఇంగ్లాండ్ తరుపున యాషెస్ సిరీస్‌లో పాల్గొంటున్న హారీ బ్రూక్, కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హారీ బ్రూక్ హాఫ్ సెంచరీ కారణంగా ఇంగ్లాండ్, తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
‘ఇంగ్లాండ్ టెస్టు టీమ్ బజ్ బాల్ కాన్సెప్ట్‌ని ఎంచుకుంది, గెలవడానికి, సిరీస్‌లు సాధించడానికి కాదు. టెస్టు క్రికెట్ చూసే జనాలను ఎంటర్‌టైన్ చేయడానికి! టెస్టు మ్యాచులకు తిరిగి ప్రాణం పోయడానికి...
గత 12 నెలలుగా ఈ విషయంలో ఇంగ్లాండ్ టెస్టు టీమ్ సక్సెస్ అయ్యిందనే అనుకుంటున్నా. టెస్టు క్రికెట్ చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. మేం ఇంకా యాషెస్ సిరీస్‌ని కోల్పోలేదు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ని ఆస్ట్రేలియా, రిటైన్ చేసుకోగలిగింది అంతే...
Harry Brook
ఆఖరి టెస్టులో మేం గెలిస్తే, సిరీస్ డ్రా అవుతుంది. వర్షం కారణంగా నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఆఖరి మ్యాచ్‌లో గెలిచి 2-2 తేడాతో సిరీస్‌ని డ్రా చేయగలమన్న నమ్మకం మాకు ఉంది. గత మ్యాచ్‌లో మేం పూర్తి ఆధిక్యం చూపించాం..
ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే, సిరీస్ రాకపోయినా... నైతికంగా విజయం సాధిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు హారీ బ్రూక్. ‘యాషెస్ సిరీస్ ఆడడం వల్ల మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రెస్ అవుతున్నారా?’ అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హారీ బ్రూక్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది..
‘నిజం చెప్పాలంటే ఆ విషయంలో యాషెస్ సిరీస్‌ది సెకండ్ ప్లేస్. యాషెస్ సిరీస్ కంటే ఐపీఎల్ ఆడడం మానసికంగా, శారీరకంగా చాలా కష్టం...’ అంటూ కామెంట్ చేశాడు 24 ఏళ్ల హారీ బ్రూక్..
ఇప్పటిదాకా 10 టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ హారీ బ్రూక్, 64.25 సగటుతో 1028 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు..