- Home
- Sports
- Cricket
- వాళ్లు మమ్మల్ని నమ్మించి, మోసం చేశారు... అలా జరగకూడదని భార్యలను కూడా ఇండియాకి పంపితే...
వాళ్లు మమ్మల్ని నమ్మించి, మోసం చేశారు... అలా జరగకూడదని భార్యలను కూడా ఇండియాకి పంపితే...
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అప్పుడెప్పుడో అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కి దాదాపు 10 నెలల ముందు బుకింగ్స్ ఓపెన్ చేస్తే... నిమిషాల్లోనే హాట్ కేకుల్లా టిక్కెట్లన్నీ అమ్ముడైపోయాయి...

దాయాదుల మధ్య పోరుకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని ఎప్పటి నుంచో విశ్వప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్...
2012-13లో చివరిసారిగా భారత్‌లో పర్యటించింది పాకిస్తాన్. ఆ టూర్‌లో పాక్ క్రికెటర్లు, కుటుంబంతో సహా ఇక్కడికి రావడం విశేసం...
‘నేను పాక్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో మా జట్టు, భారత్‌లో పర్యటించింది. నేనే భార్యా పిల్లలతో కలిసి భారత్‌కి వెళ్లాలని వాళ్లకి సూచించాను...
కొందరు ప్లేయర్లు దానికి ఒప్పుకోలేదు. భార్యలు వస్తే తాము చేసే ప్రతీ పనినీ చెక్ చేస్తారని అన్నారు. అయితే ఆ తర్వాత భారత్ పర్యటనని అందరూ ఎంజాయ్ చేశారు...
అంతకుముందు భారత టూర్లతో పోలిస్తే ఆ పర్యటన పాక్ క్రికెటర్ల ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. ఎలాంటి వివాదాలు లేకుండా చాలా సాఫీగా సాగింది...
వాస్తవానికి మాపై బురద చల్లేందుకు, మమ్మల్ని దోషులుగా నిలబెట్టేందుకు అక్కడి మీడియా చాలా ప్రయత్నాలు చేసింది. అయితే మేం వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు...
పాకిస్తాన్‌లో పర్యటించడానికి భారత జట్టు అంగీకరించడం వల్లే మేం భారత్ పర్యటనకి వచ్చాం. అయితే ఆ తర్వాత వాళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ మాజీ ప్రెసిడెంట్ జకా అష్రఫ్...