IND vs PAK: హార్ధిక్ పాండ్యాను అడ్డుకునేందుకు పాకిస్తాన్ స్పెషల్ ప్లాన్..?
Asia Cup 2022: ఆసియా కప్-2022 సూపర్-4 లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య నేడు దుబాయ్ వేదికగా మరో ఆసక్తికర పోరు జరుగనున్నది. అయితే గత మ్యాచ్ లో పాకిస్తాన్ నుంచి విజయాన్ని దూరం చేసిన పాండ్యా కోసం..

Image credit: Getty
వారం రోజుల వ్యవధిలో భారత్-పాకిస్తాన్ రెండోసారి తలపడుతున్నాయి. గత ఆదివారం ముగిసిన చిరకాల ప్రత్యర్థుల ఉత్కంఠభరిత పోరులో భారత జట్టు.. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత టాపార్డర్ బ్యాటర్లను నిలువరించిన పాక్ పేసర్లకు ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కొరకరాని కొయ్యగా మారారు.
Image credit: PTI
అయితే గత మ్యాచ్ లో తమకు విజయాన్ని దూరం చేసిన హార్ధిక్ ను ఈ మ్యాచ్ లో అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని సమాచారం. ఈ మేరకు ఆ జట్టు నిర్వహించిన అంతరంగిక సమావేశంలో పాండ్యాను బ్యాటింగ్ లో నిలువరించి బౌలింగ్ లో అడ్డుకునేందుకు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది.
Image credit: PTI
గత ఆదివారం ముగిసిన మ్యాచ్ లో హార్ధిక్.. తొలుత బౌలింగ్ లో పాక్ ను దెబ్బతీశాడు. నిలకడగా ఆడుతున్న మహ్మద్ రిజ్వాన్ తో పాటు ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ లను ఔట్ చేశాడు. 4 ఓవర్లు వేసిన పాండ్యా 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో పాకిస్తాన్ 147 పరుగులకే పరిమితమైంది.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. దీంతో రవీంద్ర జడేజా తో కలిసి హార్ధిక్ జట్టును విజయపథంలో నడిపించాడు. చివరి ఓవర్లో జడేజా ఔటైనా పాండ్యా మాత్రం సిక్సర్ తో భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
Hardik Pandya
ఈ నేపథ్యంలో పాండ్యాను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నది. గత మ్యాచ్ లో రిజ్వాన్, ఇఫ్తికార్, ఖుష్దిల్ లు పాండ్యా వేసిన బౌన్సర్లకే ఔటయ్యారు. ఈమేరకు టీమ్ మేనేజ్మెంట్.. పాకిస్తాన్ బ్యాటర్లకు ఆచితూచిగా ఆడాలని సూచించినట్టు పలు పాకిస్తాన్ మీడియాలలో కథనాలు వచ్చాయి.
Image credit: PTI
అలాగే భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో రోహిత్, కోహ్లీ, రాహుల్, సూర్యలతో పాటు పాండ్యా పైనా ఫోకస్ పెట్టాలని పాక్ బౌలర్లకు తెలిపింది. గత మ్యాచ్ లో హార్ధిక్.. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. దాంతో హార్ధిక్ బ్యాటింగ్ కు వచ్చేప్పుడు షాదాబ్ తో ఓవర్లు వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
Hardik Pandya
మరి ఈ పాకిస్తాన్ వ్యూహాలను హార్ధిక్ పాండ్యా ఎలా దాటుతాడనేది ఇప్పుడు ఆసక్తికరం. జట్టులో చోటు కోల్పోయాక సుమారు ఏడాదిన్నర పాటు తీవ్ర కసరత్తులు చేసి మానసికంగా కూడా స్థిరంగా ఉంటూ రీఎంట్రీలో అదిరిపోయే ప్రదర్శనలు చేస్తున్న పాండ్యాను పాకిస్తాన్ పద్మవ్యూహాలు ఆపుతాయా..? అనేది చూడాల్సి ఉంది.