- Home
- Sports
- Cricket
- ఆటలో అది సహజమంటున్న మహ్మద్ యూసఫ్... పాకిస్తాన్‌లో విరాట్ కోహ్లీకి పెరుగుతున్న సపోర్ట్...
ఆటలో అది సహజమంటున్న మహ్మద్ యూసఫ్... పాకిస్తాన్‌లో విరాట్ కోహ్లీకి పెరుగుతున్న సపోర్ట్...
ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎక్కువ చర్చ జరుగుతున్న విషయం ఏదైనా ఉందంటే అది విరాట్ కోహ్లీ ఫామ్. గత మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు టీ20ల్లో విరాట్ ప్లేస్ గురించి కూడా చాలా పెద్ద చర్చే జరుగుతోంది...

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ కంటే ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాని టీ20 వరల్డ్ కప్‌లో ఆడిస్తే బెటర్ అంటూ భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, పార్థివ్ పటేల్, ఆర్పీ సింగ్ వంటి వాళ్లు కామెంట్ చేయడం తీవ్ర హాట్ టాపిక్ అయ్యింది...
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడి 12, టీ20 సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడి 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
2021 ఏడాది ఆరంభంలో మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఉన్న ఏకైక ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... ఇప్పుడు వన్డేల్లో టాప్ 3ప్లేస్ నుంచి, టీ20ల్లో టాప్ 20 నుంచి కిందికి దిగజారాడు...
Image credit: Getty
‘ఆటలో ఫామ్ కోల్పోవడం సర్వసాధారణం. ప్రతీ ఒక్క క్రికెటర్ తన కెరీర్‌లో ఎప్పుడో ఓసారి దీన్ని ఫేస్ చేసి ఉంటారు. విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా భారత జట్టుకి చేసిన దాన్ని ఏమంటారు...
సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో పరుగులు సాధించి, కెప్టెన్‌గానూ విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. దాన్నితక్కువ చేసి చూస్తారేందుకు...
విరాట్ కోహ్లీ ఇప్పటికే 11 ఏళ్లల్లో 70 సెంచరీలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అతను అద్భుతంగా ఆడాడు. టెస్టుల్లో కంటే వైట్ బాల్ క్రికెట్‌లో అతని రికార్డులు అద్వితీయం. టెస్టుల్లోనూ 27 సెంచరీలు చేశాడు...
Virat Kohli
10 ఏళ్లుగా క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. గత 10 ఏళ్లల్లో విరాట్ చేసినన్ని పరుగులు ఎవ్వరూ చేయలేకపోయారు. కొన్ని పరిస్థితుల కారణంగా అతను ప్రెషర్‌లోకి వెళ్లినట్టు ఉన్నాడు..
అతనికి అన్ని విషయాలు తెలుసు. ఎవ్వరి సలహాలు అవసరం లేదు. కావాల్సిందల్లా కాస్త టైమ్.. నా ఉద్దేశంలో అతను ఇప్పటికీ నెం.1 ప్లేయరే...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్...
Virat Kohli
విరాట్ కోహ్లీ ప్లేస్‌ని భారత మాజీ క్రికెటర్లు సందేహిస్తూ, సంకోచిస్తూ విమర్శిస్తుంటే... పొరుగుదేశం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ సేవలను అభినందిస్తూ, ప్రశంసిస్తూ పొగడ్తల్లో ముంచెత్తుతుండడం కొసమెరుపు...