- Home
- Sports
- Cricket
- టీమ్‌ని కాకుండా స్టార్లను మోసినంత కాలం, టీమిండియా ఎప్పటికీ ఐసీసీ టైటిల్ గెలవలేదు.. - గౌతమ్ గంభీర్..
టీమ్‌ని కాకుండా స్టార్లను మోసినంత కాలం, టీమిండియా ఎప్పటికీ ఐసీసీ టైటిల్ గెలవలేదు.. - గౌతమ్ గంభీర్..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి, రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమవుతోంది. 444 పరుగుల లక్ష్యఛేదనలో 209 పరుగుల భారీ తేడాతో ఓడింది భారత జట్టు...

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా టైటిల్ గెలవడానికి కారణమైన భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఈ ఓటమిపై తన స్టైల్‌లో స్పందించాడు...
‘మనదేశంలో టీమిండియాని ఓ టీమ్‌గా చూడము. వ్యక్తిగత ప్లేయర్లుగా చూస్తాం. టీమ్‌లో విరాట్ కోహ్లీ ఓ స్టార్, రోహిత్ శర్మ ఓ స్టార్. టీమ్ కంటే వీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది...
టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి దేశాలు కానీ వ్యక్తులను కాకుండా టీమ్‌కి ప్రాధాన్యం ఇస్తాయి. ఇదే వాళ్ల సక్సెస్‌కి కారణం....
1983 వన్డే వరల్డ్ కప్‌లో మోహిందర్ అమర్‌నాథ్ జీ, సెమీ ఫైనల్‌లో, ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు. టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఎవ్వరైనా అమర్‌నాథ్ ఫోటో, 1983 వన్డే వరల్డ్ కప్‌తో ఉండడం చూశారా?
ఎప్పుడూ 1983 వన్డే వరల్డ్ కప్ అంటే కపిల్ దేవ్ జీ, ట్రోఫీని ఎత్తుతున్న ఫోటోలే కనిపిస్తాయి. ఆ విజయం తెచ్చిన ప్లేయర్లకు క్రెడిట్ దక్కడం లేదు. స్టార్లకు మాత్రమే క్రెడిట్ దక్కుతోంది.
Gautam Gambhir
ఇది జరిగినంత కాలం టీమిండియా ఎప్పటికీ ఐసీసీ టైటిల్స్ గెలవలేదు.. కెప్టెన్‌కి మాత్రమే క్రెడిట్ వెళ్తుంటే టీమ్‌లో ఉన్న మిగిలిన ప్లేయర్లకు గెలిపించాలనే కసి ఎలా కలుగుతుంది..’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్...
గంభీర్ వ్యాఖ్యలపై ధోనీ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు, టీమిండియాలో మార్పుల కోసం చేసినట్టు లేదని, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో తాను చేసిన దానికి క్రెడిట్ దక్కడం లేదని వాపోతున్నట్టు ఉందని ట్రోల్ చేస్తున్నారు...