MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టెండూల్కర్‌ రిటైర్మెంట్‌కి తొమ్మిదేళ్లు... ‘క్రికెట్ గాడ్’ క్రియేట్ చేసిన ఈ రికార్డులు ఎవ్వరూ టచ్ చేసేదిలే...

టెండూల్కర్‌ రిటైర్మెంట్‌కి తొమ్మిదేళ్లు... ‘క్రికెట్ గాడ్’ క్రియేట్ చేసిన ఈ రికార్డులు ఎవ్వరూ టచ్ చేసేదిలే...

సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచంలో ఇదో ఎవర్‌గ్రీన్ బ్రాండ్. క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికీ, క్రికెట్ అంటే తెలియని వాళ్లకి కూడా బాగా తెలిసిన పేరు. క్రికెట్ ఆడని,చూడని వాళ్లు కూడా సచిన్ టెండూల్కర్ గురించి ఎక్కడో ఒకదగ్గర వినే ఉంటారు. అలాంటి సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచాన్ని వదిలి, రిటైర్మెంట్ తీసుకున్నట్టు ప్రకటించి నేటికి 9 ఏళ్లు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 10 2022, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

2012 డిసెంబరులో వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ టెండూల్కర్, 2013, అక్టోబరులో టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 10వ నెల, 10వ తారీఖున 10 నెంబర్ జెర్సీ ధరించే సచిన్ టెండూల్కర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రకటించాడు. నవంబర్ 16, 2013న తన ఆఖరి అంతర్జాతీయ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఆడి క్రికెట్ ప్రస్తానానికి ముగింపు పలికాడు సచిన్ రమేశ్ టెండూల్కర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

క్రికెట్‌లో సాధించిన అనితర సాధ్యమైన రికార్డుల ద్వారా అభిమానులతో ‘క్రికెట్ దేవుడి’గా ఆరాధించబడిన సచిన్ టెండూల్కర్ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రోజున... అంటే నవంబర్ 16, 2013న మాస్టర్ బ్లాస్టర్‌ను ఉద్దేశించి 3.5 మిలియన్ల ట్వీట్లు పోస్టు అయ్యాయి...9 ఏళ్ల క్రితం ట్విట్టర్ అంటే సామాన్య జనాలకు ఇంకా తెలియని రోజుల్లో దాదాపు 35 లక్షల ట్వీట్లు రావడం ఇప్పటికీ ఓ రికార్డే... 

35

సచిన్ టెండూల్కర్ పేరుతో ట్రెండ్ అయిన ‘ThankYouSachin’ ట్వీట్‌కి పొంగిపోయిన మాస్టర్... ‘మీ సపోర్టు ఎప్పటికీ మరిచిపోలేనంటూ’ ట్వీట్ చేశాడు. అప్పుడే ఈ ట్వీట్‌కి 17 వేల రీట్వీట్లు వచ్చాయి. ఆ సంవత్సరంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా నిలిచింది సచిన్ ‘థ్యాంక్యూ’ పోస్టు...

45

‘మహాత్మా గాంధీ తర్వాత జనాల్లోకి అంతగా వెళ్లిన వ్యక్తి, పేరు సచిన్ టెండూల్కర్...’ అంటూ ఓ సంచలన కథనం ప్రచురించింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. రూపాయి నోటుపై ఉండే గాంధీ ఎంత ఫేమస్ అయ్యాడో, క్రికెట్ బ్యాటు పట్టుకున్న సచిన్ అంతే ఫేమస్ అయ్యాడంటూ వెలువడిన ఈ కథనం సచిన్ టెండూల్కర్ క్రేజ్‌కి నిదర్శనం.

55
Sachin Tendulkar

Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ ఆఖరి టెస్టు మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక జెర్సీని డిజైన్ చేసింది బీసీసీఐ. బీసీసీఐ లోగో కింద ‘సచిన్ రమేశ్ టెండూల్కర్ 200వ టెస్టు’ అని రాసి ఉన్న జెర్సీని ‘మాస్టర్’ మాత్రమే కాదు, మిగలిన జట్టు సభ్యులందరూ ధరించారు. పూజారా ఇదే జెర్సీతో సెంచరీ చేయగా, రోహిత్ శర్మ ప్రెస్ మీట్‌కి హాజరయ్యాడు. ప్రెస్ మీట్‌లో మైక్ మీద కూడా ‘SRT 200’ అని రాసి ఉండడం విశేషం.

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved