MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • నా కోసం ఒకటి, టీమ్ కోసం ఒకటి అని చెప్పేవాడిని... కెఎల్ రాహుల్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

నా కోసం ఒకటి, టీమ్ కోసం ఒకటి అని చెప్పేవాడిని... కెఎల్ రాహుల్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తొలి రెండు మ్యాచుల్లో విజయాలను అందుకుంది. అయితే రెండు మ్యాచుల్లోనూ ఓపెనర్ కెఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. పాక్‌తో మ్యాచ్‌లో 4 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతులాడి 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 28 2022, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
KL Rahul

KL Rahul

పాల్ వాన్ మీకీరన్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్. నాన్ స్ట్రైయికింగ్‌లో ఉన్న రోహిత్ శర్మ, బంతి సైడ్ నుంచి వెళ్తుందేమోనని అనుమానంతో డీఆర్‌ఎస్ తీసుకోమ్మని రాహుల్‌కి చెప్పాడు. అయితే రాహుల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పెవిలియన్ చేరాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
KL Rahul

KL Rahul

టీవీ రిప్లైలో కెఎల్ రాహుల్ అవుటైన బాల్, వికెట్లను మిస్ అవుతూ వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపించింది. కెఎల్ రాహుల్ డీఆర్‌ఎస్ తీసుకుని ఉంటే, అతను నాటౌట్‌గా తేలేవాడు. మరిన్ని పరుగులు చేసి, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే అవకాశం అయినా దక్కేది...

36

‘కెఎల్ రాహుల్ అవుటైన విధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. డీఆర్‌ఎస్ తీసుకుని ఉంటే ఏమయ్యాది? ఒకవేళ అవుట్ అన తేలితే, ఓ రివ్యూ ఛాన్స్ పోయేదేమో. నాటౌట్ అని తేలితే... పరుగులు చేసేవాడుగా. టీమ్‌ని పటిష్టమైన పొజిషన్‌లో ఉంచే అవకాశం దక్కేదిగా...

46
Image credit: PTI

Image credit: PTI

కానీ కెఎల్ రాహుల్ అలా చేయలేదు. అతను ఎందుకు రివ్యూ తీసుకోలేదో నాకైతే అర్థం కావడం లేదు. 2011లోనే నేను టీమ్‌లో ఓ రూల్ పెట్టాను. ఒకవేళ ఏ బాల్ అయినా నా ప్యాడ్స్‌ని తగిలి, అంపైర్ అవుట్‌గా ప్రకటిస్తే నేను వెంటనే రివ్యూ తీసుకుంటా... 

56

ఉన్న రెండు రివ్యూల్లో ఒకటి నాకు, మిగిలినది టీమ్ కోసం అని ముందే చెప్పా... చాలాసార్లు ఇది నాకు ఉపయోగపడింది కూడా... టీమ్‌లో ఉన్న అందరూ నాకు సపోర్ట్ చేసేవాళ్లు. కెఎల్ రాహుల్‌కి అలాంటి సపోర్ట్ లేదా? 

66
Virender Sehwag

Virender Sehwag

మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రివ్యూ తీసుకోవాలి. ఫామ్‌లో లేకపోతే రివ్యూ తీసుకునే ఛాన్స్‌ని అస్సలు మిస్ చేసుకోకూడదు. కెఎల్ రాహుల్ అసలే ఫామ్‌లో లేడు. రివ్యూ వేస్ట్ చేయడం ఎందుకని సైలెంట్‌గా వెళ్లిపోయి ఉంటాడు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved