- Home
- Sports
- Cricket
- అప్పుడు మన బౌలర్ స్పిన్ వేస్తే ఎగతాళి చేశారు, ఇప్పుడేమో... యాషెస్ సిరీస్‌లో రాబిన్‌సన్ స్పిన్ బౌలింగ్..
అప్పుడు మన బౌలర్ స్పిన్ వేస్తే ఎగతాళి చేశారు, ఇప్పుడేమో... యాషెస్ సిరీస్‌లో రాబిన్‌సన్ స్పిన్ బౌలింగ్..
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 473/9 పరుగులు చేసి డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో 230/9 పరుగులు చేసి డిక్లేర్ చేసింది...

తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది...
ఇంగ్లాండ్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇంకా 390+ పరుగులు చేయాలి. మ్యాచ్ ఇంకో రోజు ముగిలే ఉండడంతో ఫలితం ఆతిథ్యజట్టుకి అనుకూలంగా రావడం ఖాయంగా కనిపిస్తోంది...
అయితే కెప్టెన్ జో రూట్ మినహా స్పిన్నర్ లేకుండా బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు... ఫాస్ట్ బౌలర్‌ను స్పిన్నర్‌గా వాడడం హాట్ టాపిక్ అయ్యింది...
ఇంగ్లాండ్ యంగ్ ఫాస్ట్ బౌలర్ ఓల్లీ రాబిన్‌సన్, స్పిన్ బౌలర్‌గా మారి ఆఫ్ స్పిన్నర్‌గా మారి స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే రాబిన్ సన్ బౌలింగ్‌లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ చేసిన స్పిన్ బౌలింగ్ తెర మీదకి వచ్చింది...
1996 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మనోజ్ ప్రభాకర్ స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే అప్పుడు అతని బౌలింగ్ యాక్షన్‌ను తీవ్రంగా విమర్శించి, ఛీటింగ్ అంటూ ఆరోపించారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ కారణంగా ఆ తర్వాతి మ్యాచ్‌లో ప్రభాకర్‌కి జట్టులో చోటు దక్కలేదు...
అయితే ఫాస్ట్ బౌలర్లు స్పిన్ బౌలింగ్ వేయడం ఇప్పుడేమీ కొత్త కాదు. విండీస్ దిగ్గజం గార్డ్‌ఫీల్డ్ సోబర్స్, కర్సన్ గవ్రీ, కోలిన్ మిల్లర్, ఆండ్రూ సైమండ్స్‌తో పాటు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ చేశారు..
సచిన్‌తో పాటు సనత్ జయసూర్య, మార్క్ వా, సోహైల్ తన్వీర్, షేన్ తామ్సన్, కపిల్ దేవ్, జావెద్ మియాందద్‌తో పాటు రోహిత్ శర్మ, శ్రీశాంత్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే కూడా స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ చేశారు...
శ్రీశాంత్ అంతర్జాతీయ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ వేయకపోయినా సయ్యద్ ముస్తాక్ లీ టోర్నీలో స్పిన్ బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు.