- Home
- Sports
- Cricket
- ఇలా అయితే వన్డేలు ఉండవు, మరీ టీ20ల్లా మార్చేస్తున్నారు... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...
ఇలా అయితే వన్డేలు ఉండవు, మరీ టీ20ల్లా మార్చేస్తున్నారు... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...
క్రికెట్‌లోకి టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డేలకు క్రేజ్ అమాంతం పడిపోయింది. టీ20లు లేదా టెస్టు మ్యాచులు ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు, వన్డేలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు... ఏడాదిలో ఆడే వన్డేల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది...

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన తొలి వన్డే, టీ20 మ్యాచ్‌ని తలపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో ఆలౌట్ అయితే, భారత జట్టు ఆ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించేసింది. అంటే మొత్తంగా 100 ఓవర్ల పాటు జరగాల్సిన మ్యాచ్ 44 ఓవర్లలో ముగిసింది...
Jason Roy
అంతకుముందు నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 498 పరుగుల స్కోరు చేసి రికార్డు క్రియేట్ చేసింది. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న మార్పులపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు...
‘వన్డే క్రికెట్‌లో ఉంటే బ్యూటీ ఏంటంటే ఎత్తు పల్లాలు. మ్యాచ్ సాగే కొద్దీ ఆధిపత్యం చేతులు మారుతూ ఉండేది. అయితే ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఆ బ్యూటీ కనిపించడం లేదు.. వన్డే ఫార్మాట్‌లో బౌలర్లకు ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఉండేది...
నేను కూడా వన్డే మ్యాచులు చూసేటప్పుడు ఈ ఫార్మాట్ అంతమైపోతుందేమోనని భయమేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వన్డేల్లో ఆ చేతులు మారే ఆధిపత్యం కనిపించడం లేదు...
వన్‌సైడ్ గేమ్స్ ఎప్పటికీ ఫ్యాన్స్‌కి మజాని అందించవు. ఇప్పుడు వన్డే ఫార్మాట్ కేవలం టీ20 ఫార్మాట్‌కి మరిన్ని ఓవర్లు జత చేసినట్టుగా మారింది... వన్డే క్రికెట్ బతకాలంటే సరైన మార్గాన్ని కనుక్కోవాలి...
వన్డేల్లో వాడే బాల్, స్పిన్నర్లు వచ్చి మధ్య ఓవర్లు వేసేలా ఉండాలి. రివర్స్ స్వింగ్ తిరిగి రావాలి. మ్యాచ్‌ని మలుపు తిప్పడానికి అదే కీలకం.. 2010 సమయంలో వాడే బంతులను మళ్లీ వాడితే బెటర్...
అయితే ఇప్పుడు ఆ బాల్‌ని వాడే అవకాశం లేదనే అనుకుంటా. వన్డేలను చూస్తూ పెరిగాను. గ్లెన్ మెక్‌గ్రామ్ ఓ అద్భుతమైన బౌలర్. ఏ మాత్రం సహకరించని బంతితో అతను మ్యాజిక్ చేసేవాడు. ఇప్పుడు అలాంటి బౌలర్, ఇలాంటి బంతితో ఏమీ చేయలేడేమో...’ అంటూ కామెంట్ చేశాడు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్...