MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీ టీమ్‌లో అట్టర్ ఫ్లాప్, రాహుల్ టీమ్‌లో సూపర్ హిట్.. ఐపీఎల్‌లో సూపర్ రీఎంట్రీ ఇచ్చిన మార్క్ వుడ్..

ధోనీ టీమ్‌లో అట్టర్ ఫ్లాప్, రాహుల్ టీమ్‌లో సూపర్ హిట్.. ఐపీఎల్‌లో సూపర్ రీఎంట్రీ ఇచ్చిన మార్క్ వుడ్..

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మిగిలిన టీమ్‌లో బాగా ఆడిన ప్లేయర్లు, ఆర్‌సీబీలోకి వెళ్తే అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఆర్‌సీబీ నుంచి బయటికి వెళ్లిన ప్లేయర్లు, వేరే టీమ్ తరుపున అదరగొడతారు... చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ లిస్టులో చేరేలా కనిపిస్తోంది.. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 02 2023, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఎంట్రీ ఇచ్చిన మార్క్ వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. పృథ్వీ షాను అవుట్ చేసిన మార్క్ వుడ్, మిచెల్ మార్ష్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కూడా మార్క్ వుడ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Mark Wood

Mark Wood

ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్, చేతన్ సకారియాలను అవుట్ చేసిన మార్క్ వుడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో మొట్టమొదటి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్‌ని ఐపీఎల్ 2018 సీజన్‌లో కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

36

ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆడిన మార్క్ వుడ్, 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించాడు. దీంతో అతన్ని మరో మ్యాచ్ ఆడించే ప్రయత్నం చేయలేదు చెన్నై సూపర్ కింగ్స్..

46

గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరమైన మార్క్ వుడ్, 2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌పై జహీర్ ఖాన్ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు.. 

56
Image: PTI

Image: PTI

‘మార్క్‌వుడ్ అద్భుతమైన కమ్‌బ్యాక్... 2 ఓవర్లలో కేవలం 3 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు తీశాడు. 12 బంతుల్లో 11 డాట్ బాల్స్.. గాయం కారణంగా ఓ సీజన్ మొత్తానికి దూరమైన తర్వాత మార్క్ వుడ్ ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వడం అద్బుతం.. గేమ్ ఛేజర్...’ అంటూ ట్వీట్ చేశాడు జహీర్ ఖాన్..

66
Source: PTI

Source: PTI

ధోనీ టీమ్ తరుపున ఆడినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్, కెఎల్ రాహుల్ టీమ్‌ తరుపున ఆడినప్పుడు అదరగొట్టడంపై ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. కొందరు రాహుల్ కెప్టెన్సీని పొగుడుతూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు..  అయితే అక్కడ కెప్టెన్ మాహీయా? లేక రాహుల్ ఆ? అనేది కాకుండా మార్క్ వుడ్ ఫిట్‌నెస్‌ని గుర్తించాలని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Recommended image2
IPL 2026 Records: ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు
Recommended image3
IPL 2026 Purple Cap Winner: రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved