- Home
- Sports
- Cricket
- విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడతాడేమో! కానీ సచిన్ రికార్డు కొట్టడం కష్టమే... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..
విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడతాడేమో! కానీ సచిన్ రికార్డు కొట్టడం కష్టమే... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..
కొన్ని నెలల క్రితం వరకూ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడా? రాడా? అనే విషయం మీద తీవ్రమైన చర్చ జరిగింది. మూడేళ్లుగా ఫామ్‌లో లేని విరాట్‌ని టీమ్ నుంచి తప్పించాలని కూడా డిమాండ్ వినిపించింది. అయితే ఇప్పుడు కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి వరుసగా ఓ 4 సెంచరీలు బాదేశాడు. దీంతో కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డులను అందుకుంటాడా? లేదా? అనే విషయమై డిస్కర్షన్ జరుగుతోంది..

Image credit: PTI
అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డుకి ఇంకా 25 సెంచరీల దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ...
Image credit: PTI
కొందరు భారత మాజీ క్రికెటర్లు, విరాట్ కోహ్లీ 100 సెంచరీలు ఈజీగా అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేయగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఏకంగా కోహ్లీ 100 కాదు, 110 సెంచరీలు కొడతాడని అన్నాడు. అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం 100 సెంచరీలను అందుకోవడం కోహ్లీ వల్ల కాదని అంటున్నాడు...
‘100 సెంచరీలు ఎంత మంది చేశారు... కేవలం ఒకే ఒక్కడు. చాలామంది విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడని అంటున్నారు. కానీ అది చాలా చాలా పెద్ద విషయం... అవును, విరాట్ కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ దాగి ఉంది...
కోహ్లీ ఫిట్‌గా ఉన్నాడు. అయితే ఎంత మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ అయినా ఒకదాని తర్వాత ఒకటి సెంచరీలు చేస్తూ పోయినా 15 మ్యాచులు ఆడితే, ఓ మూడు సెంచరీలు చేస్తాడేమో... విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టి మరో 5-6 ఏళ్లు ఈజీగా ఆడతాడు.. అయితే 100 సెంచరీలు అందుకోవడం అంత తేలికైన విషయం కాదు...
Image credit: PTI
అయితే అసాధ్యమైతే కాదు. సచిన్ టెండూల్కర్ రికార్డులను టచ్ చేయగలవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క విరాట్ కోహ్లీయే... అది జరిగితే నాకు సంతోషమే, కానీ జరుగుతుందా? అనే నా అనుమానం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..