MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వంద కాదు, విరాట్ కోహ్లీ 110 సెంచరీలు కొడతాడు.. షోయబ్ అక్తర్ కామెంట్స్...

వంద కాదు, విరాట్ కోహ్లీ 110 సెంచరీలు కొడతాడు.. షోయబ్ అక్తర్ కామెంట్స్...

71వ సెంచరీ తర్వాత 72వ అంతర్జాతీయ సెంచరీని అందుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ... ఒకానొక దశలో విరాట్ కోహ్లీ 71 సెంచరీలతోనే రిటైర్మెంట్ తీసుకుంటాడేమోనని అనుమానాలు కూడా రేగాయి. అయితే ఆసియా కప్ 2022 తర్వాత విరాట్ మళ్లీ మునుపటి ఫామ్‌లో దూసుకుపోతున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 16 2023, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు బాదేసినా...  టెస్టు సెంచరీ అందుకోవడానికి చాలా సమయం తీసుకున్న విరాట్ కోహ్లీ.. అహ్మదాబాద్ టెస్టులో దాన్ని కూడా తీర్చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు విరాట్ కోహ్లీ, 100 సెంచరీల రికార్డును అందుకుంటాడా? లేదా? అనే విషయం మీద చర్చ జరుగుతోంది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Virat Kohli

Virat Kohli

సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రెండో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. అయితే సచిన్ 100 సెంచరీల రికార్డును అందుకోవాలంటే విరాట్ కోహ్లీ మరో 25 సెంచరీలు చేయాలి... గత మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోవడానికి కోహ్లీ పడిన ఇబ్బంది చూసిన అభిమానులు, మరో 25 సెంచరీలు అంటే కష్టమేనని డిసైడ్ అయిపోయారు...

36

సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోకపోయినా, మాస్టర్ తర్వాత మనోడేనని ఫిక్స్ అయిపోయారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డును కొట్టి తీరతాడని భరోసా వ్యక్తం చేస్తున్నాడు...

46

‘ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ లెజెండరీ క్రికెటర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కోహ్లీతో పోటీపడే ప్లేయర్ నాకెవ్వరూ కనిపించడం లేదు. ఎందుకంటే మూడు ఫార్మాట్లలో విరాట్‌లా ఆడడం, ఇన్నేళ్లు ఆడడం అంత తేలికైన విషయం కాదు. అతని అంకితభావం, ఫిట్‌నెస్ వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి...

56
Image credit: PTI

Image credit: PTI

విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం నాకేమీ వింతగా అనిపించడం లేదు. ఇన్నాళ్లు కెప్టెన్సీ ప్రెషర్‌తో బాగా ఆడలేకపోయాడు. ఇప్పుడు అతను కెప్టెన్ కాదు, ఫ్రీగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టగలుగుతున్నాడు.. విరాట్  వంద సెంచరీలు కొడతాడని నాకు పూర్తి భరోసా ఉంది..
 

66
Image credit: PTI

Image credit: PTI

సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టాడు, విరాట్ కోహ్లీ వంద కాదు, 110 సెంచరీలు కొడతాడు. కెప్టెన్సీ ప్రెషర్ లేకపోతే అతనిలో ఉన్న దెయ్యం బయటికి వస్తుంది. దానికి పరుగుల దాహం చాలా ఎక్కువ... దాని ఆకలి ఎప్పుడు తీరుతుందో చెప్పలేం...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Recommended image2
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Recommended image3
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved