హ్యాట్రిక్‌తో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన నోమన్ అలీ
cricket hattrick: ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు తొలిరోజు పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ చరిత్ర సృష్టించాడు.

cricket hattrick: పాకిస్థాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు.
టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి పాక్ స్పిన్నర్‌గా నోమన్ అలీ ఘనత సాధించాడు. 38 ఏళ్ల నోమన్ అలీ ముల్తాన్ టెస్టు తొలి రోజునే వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు నోమన్ అలీ తన తొలి హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీశాడు.
Image Credit: Getty Images
కొత్త చరిత్ర సృష్టించిన నోమన్ అలీ
టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి పాకిస్థాన్ బౌలర్ వసీం అక్రమ్. నోమన్ అలీ టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ పూర్తి చేసిన ఐదవ బౌలర్. అయితే, పాకిస్తాన్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్ నోమన్ అలీ.
నోమన్ అలీ ఈ హ్యాట్రిక్ తో పాక్ లెజెండరీ ప్లేయర్ల ప్రత్యేక జాబితాలో చేరాడు. నోమన్ అలీ కంటే ముందు నసీమ్ షా 2020 సంవత్సరంలో రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు.
Image Credit: Getty Images
మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్న నోమన్ అలీ
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌లో నోమన్ అలీ మొదటి మూడు వరుస బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్ (1), టెవిన్ ఇమ్లాచ్ (0), కెవిన్ సింక్లెయిర్ (0)లను అవుట్ చేసి టెస్ట్‌లో హ్యాట్రిక్ సాధించాడు.
38 ఏళ్ల నోమన్ టెస్టు హ్యాట్రిక్ సాధించిన అతి పెద్ద వయసులో పాకిస్థాన్ ఆటగాడిగా కూడా నిలిచాడు. నోమన్ కంటే ముందు, వసీం అక్రమ్ 1999 సంవత్సరంలో శ్రీలంకపై రెండు హ్యాట్రిక్‌లు తీసుకున్నప్పుడు అతని వయస్సు 33 సంవత్సరాలు.
మొత్తంమీద, అలీ 38 ఏళ్ల 110 రోజుల వయసులో శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ తర్వాత టెస్టు హ్యాట్రిక్ సాధించిన రెండో పెద్ద వయస్కుడు. 2016లో ఆస్ట్రేలియాపై హెరాత్ 38 ఏళ్ల 138 రోజుల్లో హ్యాట్రిక్ సాధించాడు.
టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు
1. వసీం అక్రమ్ - vs శ్రీలంక - (1999 లాహోర్ టెస్ట్)
2. వసీం అక్రమ్ - vs శ్రీలంక - (1999 ఢాకా టెస్ట్)
3. అబ్దుల్ రజాక్ - vs శ్రీలంక - (2000 గాలె టెస్ట్)
4. మహమ్మద్ సమీ - vs శ్రీలంక - (2002 లాహోర్ టెస్ట్)
5. నసీమ్ షా - vs బంగ్లాదేశ్ - (2020 రావల్పిండి టెస్ట్)
6. నోమన్ అలీ - vs వెస్టిండీస్ - (2025 ముల్తాన్ టెస్ట్)
వసీం అక్రమ్ - పాకిస్తాన్ తొలి హ్యాట్రిక్ మ్యాన్
పాకిస్థాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడు వసీం అక్రమ్. వసీం అక్రమ్ 1999లో శ్రీలంకపై మొదట లాహోర్‌లో ఆపై ఢాకాలో రెండుసార్లు ఈ ఫీట్ సాధించాడు. దీని తర్వాత, జూన్ 2000లో గాలేలో శ్రీలంకపై అబ్దుల్ రజాక్ హ్యాట్రిక్ సాధించాడు.
2002లో లాహోర్‌లో జరిగిన ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మహ్మద్ సమీ పాకిస్థాన్ తరఫున హ్యాట్రిక్ సాధించాడు. నోమన్ అలీ కంటే ముందు, టెస్టు హ్యాట్రిక్ సాధించిన చివరి పాకిస్థానీ నసీమ్ షా, ఫిబ్రవరి 2020లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై ఈ ఘనత సాధించాడు.