- Home
- Sports
- Cricket
- మరి వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మూడు ఫైనల్స్ పెట్టమంటావా..? రోహిత్‌కు భజ్జీ సూటి ప్రశ్న
మరి వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మూడు ఫైనల్స్ పెట్టమంటావా..? రోహిత్‌కు భజ్జీ సూటి ప్రశ్న
WTC Final 2023: రెండేండ్ల పాటు నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత ఫైనల్ కు ఒక్క మ్యాచ్ సరిపోదని.. బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టాలని టీమిండియా సారథి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై హర్భజన్ సింగ్ స్పందించాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన బెస్టాఫ్ త్రీ ఫైనల్ కామెంట్స్ పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. మూడు టెస్టు మ్యాచ్ లు చూసి ఫలితం కోసం వేచి చూసే ఓపిక ఎవరికీ లేదని.. మరి రోహిత్ వన్డే వరల్డ్ కప్ లో కూడా మూడు ఫైనల్ లు ఉండాలంటాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రోహిత్ కామెంట్స్ పై భజ్జీ స్పందిస్తూ.. ‘నేను రోహిత్ ను ఒక విషయం అడగదలుచుకున్నా. అతడు చెప్పినట్టే బెస్టాఫ్ త్రీని వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఆడించాలా..? ఐపీఎల్ లో కూడా ఒక ఫైనలే ఉంటుంది కదా..? ఒకవేళ ఇప్పుడు భారత్ ప్లేస్ లో న్యూజిలాండో, ఇంగ్లాండో ఉండి ఉంటే రోహిత్ ఇలాగే మాట్లాడేవాడా..?
Image credit: Getty
లేదు. కచ్చితంగా ఇలా మాట్లాడేవాడు కాదు. అప్పుడు ఒక్క ఫైనల్ మాత్రమే చాలు అనేవాడు. కావున 50 ఓవర్స్ వరల్డ్ కప్ లో ఒకటే ఫైనల్ ఉంటుంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో కూడా ఒకటే ఫైనల్ ఉంటుంది. టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి మెగా ఈవెంట్లలో ఒకటే ఫైనల్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి..’అని చెప్పాడు.
రోహిత్ కామెంట్స్ పై పాట్ కమిన్స్ కూడా ఘాటు రిప్లైనే ఇచ్చిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ లో ఒకటే ఫైనల్ ఉంటుందని.. అక్కడ రెండు మూడు ఫైనల్స్ ఉండవని అన్నాడు.
సునీల్ గవాస్కర్ సైతం ఇదే విషయమై స్పందిస్తూ.. ఇప్పుడు బెస్టాఫ్ త్రీ అడిగేవాళ్లు రాబోయే రోజుల్లో బెస్టాఫ్ ఫై కూడా అడుగుతారని, ఒక ఫైనల్ సరిపోతుందని తెలిపాడు. భజ్జీ కూడా గవాస్కర్ వ్యాఖ్యాలను సమర్థించాడు. ‘నేను సన్నీ సార్ వ్యాఖ్యలతో ఏకభవిస్తున్నా. డబ్ల్యూటీసీ ఫైనల్ పై ఐసీసీ ముందే డేట్స్ ప్రకటిస్తుంది. అక్కడ బెస్టాఫ్ త్రీ ఫైనల్ ఉండదు.
అలాంటివి ద్వైపాక్షిక సిరీస్ లలో పనిచేస్తాయి. మీరు అక్కడ బెస్టాఫ్ త్రీ కాదు.. ఫోర్, ఫైవ్ కూడా ఆడుకోవచ్చు. కానీ ఐసీసీ ఫైనల్ అలా కాదు. అది ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ఉండాలి. ఒక్క టెస్టు మ్యాచ్ చూసేందుకే జనాలు రావడం లేదు. అలాంటిది మూడు మ్యాచ్‌లు ఎవరు చూస్తారు..?’ అని ప్రశ్నించాడు.