MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్‌కి, పాండ్యాకి పెద్ద తేడా లేదు... సంజూ శాంసన్, గిల్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు ఇవ్వకుండా...

రోహిత్‌కి, పాండ్యాకి పెద్ద తేడా లేదు... సంజూ శాంసన్, గిల్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు ఇవ్వకుండా...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా టైటిల్‌కి రెండు అడుగుల దూరంలో ఆగిపోయింది.ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది భారత జట్టు. ఈ పరాజయంతో టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు హార్ధిక్ పాండ్యాకి దక్కబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 20 2022, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hardik pandya

hardik pandya

36 ఏళ్ల రోహిత్ శర్మ, అనేక కారణాల వల్ల టీమ్‌కి సరిగ్గా అందుబాటులో ఉండలేకపోతున్నాడు. రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చింది భారత జట్టు. ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ కూడా చేరలేకపోయింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Hardik Pandya, rohith sharma

Hardik Pandya, rohith sharma

రోహిత్ శర్మ స్థానంలో ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి టీ20 కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినబడుతోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి సారథ్యం వహించిన హార్ధిక్ పాండ్యా, కెప్టెన్‌గా మొట్టమొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు...

36
Image credit: Getty

Image credit: Getty

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్‌కి మొదటి పరీక్ష కానుంది. ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్, టీమిండియాకి బ్యాటింగ్ అప్పగించింది. అయితే రెండో టీ20 ఆడుతున్న జట్టుపై పెదవులు విరుస్తున్నారు అభిమానులు...
 

46

సంజూ శాంసన్‌తో పాటు శుబ్‌మన్ గిల్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ రిజర్వు బెంచ్‌కే పరిమతమయ్యారు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ని పక్కనబెట్టిన హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో చోటు ఇచ్చాడు. అదీకాకుండా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్ చేశారు...

56

సంజూ శాంసన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకుండా ఇషాన్ కిషన్‌ని ఆడించడాన్ని బట్టి చూస్తుంటే.. రోహిత్ శర్మకు, హార్ధిక్ పాండ్యాకి పెద్ద  తేడా ఏమీ కనిపించడం లేదని విమర్శలు చేస్తున్నారు అభిమానులు. సీనియర్లతో సేఫ్ గేమ్ ఆడితే విజయాలు వస్తాయని హార్ధిక్ పాండ్యా భావిస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. 

66
umran malik

umran malik

ఉమ్రాన్ మాలిక్‌ లాంటి బౌలర్‌ని పెట్టుకుని కూడా అతనికి తుది జట్టులో చోటు ఇవ్వడానికి రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు... పాకిస్తాన్, ఇంగ్లాండ్ వంటి వేరే టీమ్స్ అయితే  ఉమ్రాన్ మాలిక్‌ని ఈపాటికి 20-30 మ్యాచులు ఆడించి ఉండేవని వాపోతున్నారు..

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
India T20 captain: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌పై బీసీసీఐ వేటు ! టీమిండియా కొత్త కెప్టెన్ ఇతనేనా?
Recommended image2
Team India Captain : సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ ఔట్... టీమిండియా కెప్టెన్ ఇతడే..?
Recommended image3
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా.. బ్రాండ్ వాల్యూ డబుల్.. ఒక్కో యాడ్‌కు కోట్లలో డిమాండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved