- Home
- Sports
- Cricket
- అవును, వన్డేల్లో నేను ఫ్లాప్ అయ్యాను! అయితే వాళ్లు నాకు ఒకే విషయం చెప్పారు... - సూర్యకుమార్ యాదవ్
అవును, వన్డేల్లో నేను ఫ్లాప్ అయ్యాను! అయితే వాళ్లు నాకు ఒకే విషయం చెప్పారు... - సూర్యకుమార్ యాదవ్
టీ20ల్లో దుమ్మురేపుతూ ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఇప్పటిదాకా క్లిక్ కాలేకపోయాడు. టీ20ల్లో సూర్య ఆడుతున్న విధానం కారణంగా అతను వన్డేల్లో క్లిక్ అయితే, టీమిండియాకి మ్యాచ్ విన్నర్ అవుతాడు. అయితే ఎక్కడో తేడా కొడుతోంది...

Suryakumar Yadav
వన్డే ఫార్మాట్‌లో వరుసగా విఫలమవుతున్నా సూర్యకుమార్ యాదవ్‌కి ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తోంది టీమిండియా. శ్రేయాస్ అయ్యర్ వరుసగా గాయపడుతుండడం కూడా సూర్య వన్డేల్లో వరుస అవకాశాలు దక్కించుకోవడానికి కారణమవుతోంది..
Suryakumar Yadav
వన్డే ఫార్మాట్‌లో ఇప్పటిదాకా 26 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 24.33 స్ట్రైయిక్ రేటుతో 511 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఎప్పటిలాగే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఫెయిలైన సూర్య, టీ20ల్లో మాత్రం తన ట్రేడ్ మార్క్ చూపించాడు..
మూడో టీ20 మ్యాచ్‌లో 44 బంతుల్లో 83 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 12వ సారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. అంతేకాకుండా 49 ఇన్నింగ్స్‌ల్లోనూ 100 టీ20 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు...
‘వన్డేల్లో నా పర్ఫామెన్స్ అస్సలు బాగోలేదు, దాన్ని ఒప్పుకోవడానికి నేనేం సిగ్గుపడడం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మేం నిజాయితీగా మాట్లాడుకుంటాం. పర్ఫామెన్స్ విషయంలోనూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవడం ఇంకా అవసరం. అయితే దాన్ని మెరుగుపర్చుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా...
రోహిత్, రాహుల్ సర్ నాకు ఒక్క విషయమే చెప్పారు... నేను వన్డే ఫార్మాట్ ఎక్కువగా ఆడలేదు, అందుకే ఎక్కువ మ్యాచులు ఆడమని అన్నారు. అందుకే వన్డే ఫార్మాట్ గురించి నేర్చుకుంటున్నా. ఆఖరి 10-15 ఓవర్లలో బ్యాటింగ్ చేస్తే, టీమ్‌కి ఏం కావాలో తెలుసుకుని ఆడాల్సి ఉంటుంది..
Suryakumar Yadav
45-50 బాల్స్ ఆడినా నా స్టైల్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అదే మొదటి 15-18 ఓవర్లలో బ్యాటింగ్ చేయాల్సి వస్తే, కాస్త ఓపిగ్గా ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుందని రాహుల్ సర్ చెప్పారు. అవకాశాలు వస్తున్నాయి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా చేతుల్లోనే ఉంది..
Dravid Suryakumar
కొన్నేళ్లుగా మేం చాలా టీ20 మ్యాచులు ఆడాం. అందుకే అది నాకు అలవాటుగా మారిపోయింది. వన్డేలకు తగ్గట్టుగా నా ఆటతీరు మార్చుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఎందుకంటే టీ20లతో పోలిస్తే, వన్డే ఫార్మాట్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సి ఉంటుంది...
Suryakumar Yadav
పవర్ ప్లేలో ఒకలాగా, మిడిల్ ఓవర్‌లో రన్ రేట్ పడిపోకుండా బాల్‌కో పరుగు తీస్తూ, చివరి ఓవర్లలో టీ20 ఫార్మాట్‌లా ఆడాల్సి ఉంటుంది. వన్డే ఫార్మాట్‌లో నానుంచి ఏం కోరుకుంటున్నారో మేనేజ్‌మెంట్ చెప్పింది, దాన్ని అమలు చేయడానికే నేను ప్రయత్నిస్తున్నా..
Suryakumar Yadav
వన్డే వరల్డ్ కప్‌కి ముందు 7-8 వన్డేలు ఆడబోతున్నాం. ప్రపంచ కప్‌కి సిద్ధం కావడానికి ఈ మ్యాచులు సరిపోతాయి. అంతేకాకుండా బీసీసీఐ క్యాంపు కూడా ఉంది. జట్టుగా సమయం గడిపడం కూడా చాలా అవసరం.. ఈసారి గెలవడానికి ప్రయత్నిస్తాం..’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్..