ఇక రిజర్వు డేలు లేవు! వర్షంతో మ్యాచులన్నీ రద్దు అయితే... ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఆ రెండు టీమ్స్..
పంతం పట్టి మరీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌కి రిజర్వు డే పెట్టించింది బీసీసీఐ. రెండు రోజుల పాటు సాగిన మ్యాచ్‌లో టీమిండియా, పాకిస్తాన్‌పై 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దు అయి ఉంటే, భారత జట్టుకి కష్టమైపోయేది..
భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగి 356 పరుగుల భారీ స్కోరు అందించారు. ఈ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 128 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా +4.56 నెట్ రన్ రేట్‌కి దూసుకెళ్లింది..
బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక, +0.42 నెట్ రన్ రేటుతో రెండో స్థానంలో ఉంటే, ఓ విజయం, ఓ పరాజయం అందుకున్న పాకిస్తాన్ -1.892 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. 2 మ్యాచుల్లో ఓడిన బంగ్లాదేశ్ -0.749తో ఆఖరి స్థానంలో ఉంది...
ఇకపై ఏ మ్యాచ్‌కీ రిజర్వు డే లేదు. ఇండియా - శ్రీలంక మధ్య మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. శ్రీలంక- పాకిస్తాన్ మ్యాచ్ జరిగే సెప్టెంబర్ 14న, బంగ్లాదేశ్ - టీమిండియా మ్యాచ్ జరగాల్సిన సెప్టెంబర్ 15న కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది..
ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడు మ్యాచులు ఫలితం తేలకుండా రద్దు అయితే పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న భారత్, శ్రీలంక.. ఆసియా కప్ 2023 ఫైనల్‌కి చేరతాయి. పాకిస్తాన్ ఫైనల్‌కి రావాలంటే శ్రీలంకతో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది...
ఒకవేళ మ్యాచులు వర్షం అంతరాయం లేకుండా సజావుగా ముగిస్తే ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారుతుంది. టాప్‌లో ఉన్న టీమిండియా, శ్రీలంకతో మ్యాచ్ ఓడిపోతే.. లంక దాదాపు ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది.
భారత జట్టు, ఆఖరి సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. పాకిస్తాన్, శ్రీలంకపై గెలిస్తే... మూడు జట్లు కూడా రెండేసి విజయాలతో ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా మూడు జట్లలో టాప్ 2 ఫైనల్‌కి చేరతాయి..