- Home
- Sports
- Cricket
- శుబ్‌మన్ గిల్ పరిస్థితి ఏంటి? ఓపెనింగ్ పొజిషన్ పోయి, వారి రాకతో మిడిల్ ఆర్డర్‌లోనూ...
శుబ్‌మన్ గిల్ పరిస్థితి ఏంటి? ఓపెనింగ్ పొజిషన్ పోయి, వారి రాకతో మిడిల్ ఆర్డర్‌లోనూ...
సాధారణంగా ఐపీఎల్ ద్వారా బ్యాటర్లు టీ20ల్లోకి, వన్డే టీమ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. ఆరంగ్రేటంలోనే అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, గాయం కారణంగా జట్టులో స్థానాన్ని క్లిష్టతరం చేసుకున్నాడు...

ఆడిలైడ్ టెస్టులో ఘోర ఓటమి తర్వాత పృథ్వీషా స్థానంలో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న గిల్, ఆ సిరీస్ మొత్తం ఓపెనర్‌గా వచ్చాడు...
రోహిత్ శర్మ రీఎంట్రీ తర్వాత అప్పటికే రెండేళ్ల అనుభవం ఉన్న మయాంక్ అగర్వాల్‌ను పక్కనబెట్టి మరీ, శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇచ్చింది భారత జట్టు...
బ్రిస్బేన్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి, టీమిండియా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన శుబ్‌మన్ గిల్, వరుస అవకాశాలు దక్కించుకున్నాడు..
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయిన శుబ్‌మన్ గిల్, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తర్వాత గాయంతో జట్టుకి దూరమయ్యాడు...
శుబ్‌మన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని అనుకుంది బీసీసీఐ. అయితే మయాంక్ కూడా ప్రాక్టీస్ సెషన్స్‌లో బౌన్సర్ తగిలి గాయపడడంతో ఆ ప్లేస్‌లోకి కెఎల్ రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు...
రాకరాక రెండేళ్ల తర్వాత టెస్టుల్లో చోటు దక్కించుకున్న కెఎల్ రాహుల్, ఆ సిరీస్‌లో ఓ భారీ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు... ఆ తర్వాత టెస్టుల్లో వైస్ కెప్టెన్సీయే దక్కించుకున్నాడు...
కెఎల్ రాహుల్ గాయపడడంతో మరోసారి శుబ్‌మన్ గిల్‌కి ఛాన్స్ రావచ్చని భావించారంతా. అయితే ముంబై టెస్టులో భారీ సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్... ఆ ప్లేస్‌ను లాగేసుకున్నాడు...
మయాంక్ అగర్వాల్ సెంచరీ కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం అతనికే దక్కింది...
కనీసం మిడిల్ ఆర్డర్‌లో అయినా శుబ్‌మన్ గిల్‌కి ఛాన్స్ దక్కుతుందేమోనని అనుకుంటే, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్‌లతో అక్కడ కూడా ప్లేయర్లు సెటిల్ అయిపోయారు...
ఇప్పుడు శుబ్‌మన్ గిల్... ఏ ప్లేయర్ అయినా గాయపడకపోతాడా? తనకి ఛాన్స్ రాకపోతుందా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితిలో ఉన్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...