ధోనీ ఐపీఎల్ తప్ప ఇంకేమీ ఆడడా... జార్ఖండ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్, యూపీ కెప్టెన్‌గా సురేశ్ రైనా...
2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020 స్వాతంత్య్ర దినోత్సవం రోజున రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2020 సీజన్ తర్వాత ఐపీఎల్ కూడా ఆడడేమోనని ప్రచారం జరిగినా, వాటిని కొట్టిపారేసిన మాహీ... ఐపీఎల్ మినహా మరో లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదు.
16 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన మహేంద్ర సింగ్ ధోనీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు..
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటూ... సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోనీ... దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.
ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్‌కి దూరంగా ఉన్న యువరాజ్ సింగ్, సురేశ్ రైనా లాంటి వాళ్లు సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటే... ధోనీ మాత్రం ఐపీఎల్ ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
ధోనీ గైర్హజరీతో సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకి ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు... ముంబై ఇండియన్స్‌కి ఆడే ఇషాన్ కిషన్ జన్మస్థలం జార్ఖండ్.
విరాట్ సింగ్ జార్ఖండ్ జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తుంటే తన జట్టులో షాబద్ నదీమ్, సౌరవ్ తివారి, అనుకుల్ రాయ్, వరుణ్ అరోణ్, మోను కుమార్ సింగ్ వంటి ప్లేయర్లు ఉన్నారు.
ధోనీతో పాటే రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా... సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ జట్టుకి రైనా కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు.
జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ 2021 కోసం ఆరు నగరాలను వేదికలుగా ఎంచుకుంది బీసీసీఐ. బయో బబుల్ సెక్యులర్ జోన్‌లో జరిగే ఈ టోర్నీ జనవరి 31న ముగుస్తుంది.
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్... సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల బ్యాన్ అనుభవించిన వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ కూడాసయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు...