- Home
- Sports
- Cricket
- బుమ్రా లేడు! షాహీన్ ఆఫ్రిదీ వస్తున్నాడు... టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో...
బుమ్రా లేడు! షాహీన్ ఆఫ్రిదీ వస్తున్నాడు... టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన భారత జట్టు, ఆ తర్వాత ఆసియా కప్ 2022 సూపర్ 4 రౌండ్‌లోనూ దాయాది జట్టు చేతుల్లో ఓడింది. అయితే ఈసారి పాక్ మరింత బలంగా బరిలో దిగుతోంది...

Image credit: Getty
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయాలతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యారు. బుమ్రా ప్లేస్‌లో ఎవరిని ఆడించాలనే విషయంలో బీసీసీఐకి ఇంకా క్లారిటీ రాలేదు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని మహ్మద్ షమీకే పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కే అవకాశం ఉంది...
అయితే మరోవైపు పాకిస్తాన్ మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌కి ముందు అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన షాహీన్ షా ఆఫ్రిదీ... త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...
Shaheen Afridi
గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి కూడా దూరమైన షాహీన్ షా ఆఫ్రిదీ, ప్రస్తుతం న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లోనూ పాల్గొనడం లేదు. అయితే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టు సమాచారం...
shaheen afridi
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు వార్మప్ మ్యాచుల్లో షాహీన్ ఆఫ్రిదీని ఆడించి, నేరుగా భారత జట్టుపై ఆడించాలని భావిస్తోందట పాకిస్తాన్ జట్టు. షాహీన్ షా ఆఫ్రిదీ రీఎంట్రీ ఇస్తుండడంతో ఈసారి ఈ బౌలర్‌ను మన క్రికెటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది...
Shaheen Afridi-Virat Kohli
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికి రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన షాహీన్ షా ఆఫ్రిదీ, ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ కూడా షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...
shaheen
భారత బ్యాటింగ్ ఆర్డర్‌కి వెన్నెముకలాంటి ప్లేయర్లైన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లు తీసిన షాహీన్ షా ఆఫ్రిదీ... ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత టాపార్డర్ వికెట్లు ఎలా తీసింది.. అనుకరిస్తూ స్టేడియంలో వెటకారం చూపించాడు. ఈ సంఘటన తర్వాత షాహీన్ ఆఫ్రిదీపై భారత అభిమానులు తీవ్రమైన కోపంతో ఉన్నారు...
shaheen
ఆసియా కప్ 2022 టోర్నీలో గాయంతో తప్పించుకున్న షాహీన్ ఆఫ్రిదీని ఈసారి ఓ ఆటాడుకుని, అతని పొగరుకి సరైన సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు టీమిండియా అభిమానులు. అయితే పాక్ ప్రధాన పేస్ అస్త్రం షాహీన్ ఆఫ్రిదీ ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్‌కి సిద్ధం కాగా, భారత ప్రధాన అస్త్రం బుమ్రా లేకపోవడం టీమ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది...