- Home
- Sports
- Cricket
- అతన్ని అవుట్ చేయడానికి పెద్ద కష్టపడలేదు, సింపుల్ ప్లాన్, దొరికిపోయాడు... ఓల్లీ రాబిన్‌సన్ కామెంట్స్...
అతన్ని అవుట్ చేయడానికి పెద్ద కష్టపడలేదు, సింపుల్ ప్లాన్, దొరికిపోయాడు... ఓల్లీ రాబిన్‌సన్ కామెంట్స్...
ప్రస్తుతతరంలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. 23 వేల అంతర్జాతీయ పరుగులకు ఒక్క పరుగు దూరంలో నిలిచిన విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి తాను పెద్దగా కష్టపడలేదని ఇంగ్లాండ్ యంగ్ పేసర్ ఓల్లీ రాబిన్‌సన్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి...

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఓల్లీ రాబిన్‌సన్, 8 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ల కారణంగా తర్వాతి మ్యాచ్‌లో నిషేధానికి గురయ్యాడు... టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు...
తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన ఓల్లీ రాబిన్‌సన్, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి... టీమిండియా పతనాన్ని శాసించాడు. క్రీజులో కుదురుకుపోయిన రోహిత్ శర్మతో పాటు కీలకమైన ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వికెట్టు తీసిన రాబిన్‌సన్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా గెలుచుకున్నాడు...
‘చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఇది తొలి విజయం. మొదటి విజయంలోనే నాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కడం మరింత సంతోషాన్ని ఇస్తోంది...
నాకెప్పుడూ లీడ్స్‌లో బౌలింగ్ చేయడం భలే ఇష్టం. ఇక్కడి పిచ్ ఎలా స్పందిస్తుందో ఎంతగానో గమనించి, అర్థం చేసుకోగలిగాను. దాన్ని కరెక్టుగా వాడుకుని సక్సెస్ అయ్యా...
సీనియర్ జేమ్స్ అండర్సన్‌తో కలిసి బౌలింగ్ చేయడం ఓ గౌరవంగా భావిస్తున్నా. జిమ్మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటా. జిమ్మీ లాంటి సీనియర్ల సలహాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి...
నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి నేను పెద్దగా కష్టపడలేదు. రెండో టెస్టులో విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి వాడిన ఫార్ములానే ఇక్కడ కూడా ఉపయోగించా...
నాలుగు, ఐదో స్టంప్ లైన్‌లో బంతులు వేస్తూ ఉంటే, విరాట్ కోహ్లీ ఆడడానికి ట్రై చేసి, క్యాచ్ ఇస్తాడని గ్రహించా. నేను కానీ, జేమ్స్ అండర్సన్ కానీ అదే ప్లాన్‌ను అమలు చేస్తున్నాం...
నేను వేసిన ఓవర్‌లో విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు. అయినా సరే అదే లైన్‌లో బౌలింగ్ చేశా, నేను అనుకున్నట్టే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... విరాట్ కోహ్లీ వికెట్ తీయడం గర్వంగా భావిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఓల్లీ రాబిన్‌సన్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే విధంగా అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. మూడు సార్లు జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఇలా అవుట్ కాగా, రెండు సార్లు ఓల్లీ రాబిన్‌సన్ అతని వికెట్ తీశాడు...
సిరీస్‌లో తొలిసారిగా లీడ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మార్కు దాటి, ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించిన విరాట్ కోహ్లీ, సెంచరీ చేస్తాడని ఆశలు రేగుతున్న సమయంలో మళ్లీ అదే స్టైల్‌లో ఫిప్త్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని వేటాడబోయి అవుట్ అయ్యాడు...
రెండో ఇన్నింగ్స్‌లో 125 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, తొలి ఇన్నింగ్స్‌లో 17 బంతుల్లో 7 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు... రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్‌ను, రాబిన్‌సన్‌ను చక్కగా ఎదుర్కొంటున్నట్టు కనిపించిన కోహ్లీ, మళ్లీ అలాగే అవుట్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.